ప్రేమ లేఖలు
ప్రేమ లేఖలు
మనిషికి ప్రతిరూపాలు
అక్షర సత్యాలు
హృదయ స్పందనలు
అక్షర అక్షరములో
నిజం నిండుగా ఉంటుంది
మనసు ఉప్పొంగి పోతుంది
జన్మ తరిస్తుంది
లేసిన మొదలు
లేఖకొరకు ఎదిరిచుస్తారు
చదివి ప్రతి పదాన్ని పలుకుతు
మదిలో తలుచుకుంటారు
ఊహలలో ఊరేగుచుంటారు
కాలం కొరకు కాసుకుంటారు
రాకను ఆహ్వానిస్తారు,
నిదురలేని రాత్రులు గడుపుతారు
ప్రేమ లేఖలలో
ప్రేమ ప్రతిధ్వనిస్తుంది
కవిత్వం జాలువారుతుంది
స్పందన వేయిఏనుగుల బలానిస్తుంది
ప్రేమికుల
కలల సౌదాలుగా
తరగని సంపదగా
జీవితాంతం జ్ఞపకాలుగా మిగిలిపోతాయి
ప్రేమ లేఖలను
భద్రపరుచుకొని
మల్లి మల్లి చదువుకొనె
మరువలేని మహాత్తర ఘట్టం
అనుభవించే వారికే
అర్ధమవుతుంది
ఆస్వాధించేవారికే
ఆ వేదన,ఆనందం,భోధపడుతుంది.
రచన.
కడెం. ధనంజయ
చిత్తలూర్.