ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం

నాగారం ఏప్రిల్ 18 తెలంగాణ వార్త : నాగారం మండల లో విలేకరిగా పనిచేస్తున్న ఫణిగిరి గ్రామానికి చెందిన సంపతి నరసయ్య తండ్రి సంపతి వెంకటయ్య ఇటీవల మరణించగా శుక్రవారం దశదినకర్మ సందర్భంగా నాగారం మండల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆయన కుటుంబాన్ని సందర్శించి మృతుని చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆర్థిక సహాయం అందజేసిన వారిలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు లక్ష్మణ్ సభ్యులు నరేష్ రమేష్ అంజయ్య జాన్ ప్రసాద్ మహేష్ జోసెఫ్ మహేందర్ శ్రావణ్ తిరుపతి మహేష్ నాగమల్లు నవీన్ ఆంజనేయులు తదితరులు ఉన్నారు.