దాతృత్వంలో తండ్రి మించిన తనయుడు

Apr 7, 2024 - 20:11
Apr 7, 2024 - 20:13
 0  4
దాతృత్వంలో తండ్రి మించిన తనయుడు
దాతృత్వంలో తండ్రి మించిన తనయుడు

- మసీదులో మూడు లక్షల వ్యయంతో ఉజు ఖానా నిర్మాణం

-ఆసిఫ్ ను అభినందిస్తున్న ముస్లింలు

సూర్యాపేట :- ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరు అన్న అనగానే నేనున్నానంటూ ఆపన్న హస్తం అందిస్తున్న ఐదో వార్డ్ మున్సిపల్ కౌన్సిలర్ ఎస్కే భాషా మియా ప్రజల మన్ననలు పొందుతున్న విషయం విందితమే.  ఇతడిలాగే తన తనయుడు ఆసిఫ్ తండ్రికి మించిన తనయుడిగా సేవా కార్యక్రమాల్లో ముందుకు దూసుకుపోతున్నడు. రంజాన్ మాసంను పురస్కరించుకొని తన తండ్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఐదవ వార్డు దురాజ్పల్లిలోని మసీదులో ముస్లిం సోదరుల సౌకర్యార్థం తన నానమ్మ ఎస్ కే ఖాజా బీ జ్ఞాపకార్థం రూ. 3 లక్షల వ్యయంతో వుజూ ఖానా (నమాజ్ కు ముందు ముస్లిం సోదరులు కాళ్లు చేతులను శుభ్రం చేసుకుని స్థలం) ను తన సొంత డబ్బులతో నిర్మాణం చేశారు. ఆదివారం సాయంత్రం సూర్యాపేట నియోజకవర్గ ముస్లిం మత గురువు అత్తర్ మౌలానా, ఖలీల్ సాబ్ లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మసీదు అభివృద్ధి కోసం పాటుపడుతున్న భాష మీ కుటుంబానికి అల్లా అన్నివేళలా అండగా నిలవాలని ఆకాంక్షించారు. రానున్న రోజుల్లో మసీదును మరింత అత్యాధునికంగా అభివృద్ధి చేసేందుకు అల్లా వారికి శక్తిని ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మత పెద్ద గయాజ్ సాబ్, కౌన్సిలర్ భాషా మియా, ఎస్కే సైదా మియా, ఎస్కే నాగులు, పఠాన్ నాగులు, పఠాన్ అజ్గార్, పఠాన్ సైది, ఎస్కే యూసుఫ్, ఎస్కే మహమూద్, ఎస్కే షరీఫ్, పఠాన్ ఇమాం సాబ్, ఎస్కే ఖమర్ పాషా, మజీద్ కమిటీ సభ్యులు తదితరాలు పాల్గొన్నారు.

ఆసిఫ్ ను అభినందించిన ముస్లింలు

దురాజ్పల్లి మసీదు లో తన సొంత డబ్బులు రూ. 3 మూడు లక్షలతో వుజూ ఖానా నిర్మించిన ఆసిఫ్ ను ముస్లిం సోదరులు అభినందించారు. చిన్న వయసులోనే అల్లా పట్ల మక్కువతో మసీదు అభివృద్ధికి తోడ్పాటు అందించడం హర్షనీయమని అన్నారు. మునుముందు ఆసిఫ్ మసీదు అభివృద్ధితో పాటు ఉన్నత స్థానంలో ఎదగాలని అల్లాను ప్రార్థించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333