ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు పై హై లెవెల్ రోడ్డు బ్రిడ్జి నిర్మాణానికి 121.92 కోట్ల రూపాయలు మంజూరు చేసిన ముఖ్యమంత్రి

Jul 2, 2025 - 18:47
 0  0
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు పై హై లెవెల్ రోడ్డు బ్రిడ్జి నిర్మాణానికి 121.92 కోట్ల రూపాయలు మంజూరు చేసిన ముఖ్యమంత్రి

 ఏనుముల రేవంత్ రెడ్డి,నీటిపారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కు గద్వాల నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపిన - సరితమ్మ 

జోగులాంబ గద్వాల 1 జూలై 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్వాల నియోజకవర్గంలోని ధరూర్ మండల పరిధిలోని రేవులపల్లి గ్రామం దగ్గర ఉన్న ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు హై లెవెల్ రోడ్డు బ్రిడ్జ్ నిర్మాణం కొరకు రాష్ట్ర ప్రభుత్వం 121.92 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ జీవో  జారీ చేస్తూ శనివారం రోజు జూరాల ప్రాజెక్టును సందర్శించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జూరాల హై - లెవెల్ రోడ్డు బ్రిడ్జి నిర్మాణానికి జీవో వెంటనే ఇస్తామని హామీ ఇవ్వడం జరిగిందని,ఇచ్చిన మాట ప్రకారం జీవో ఇచ్చిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి,నీటిపారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు దామోదర్ నరసింహ,జిల్లా మంత్రివర్యులు, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎంపీ మల్లు రవి గార్లకు గద్వాల నియోజకవర్గ రైతాంగం ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333