ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

పునరావాస కేంద్రం ను ఉపయోగించుకోవాలి
ప్రమాదకర ఇండ్లను యాజమానుల సమ్మతి తో కూల్చి వేస్తాం
మున్సిపల్ చైర్మన్ శ్రీ G చిన్న దేవన్న గారు
జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మునిసిపాలిటి పరిధిలో కురుస్తున్న భారీ వర్షాలకు శిధిలావస్థలో ఉన్న ఇండ్లలో వారికి పునరావాస కేంద్రం గా సంతబజార్ లోని బాలికల ఉన్నత పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగిందని మున్సిపల్ చైర్మన్ శ్రీ G చిన్న దేవన్న గారు మరియు మండల తహశీల్దార్ శ్రీమతి జ్యోతి గారు తెలిపారు.
ప్రమాదకరంగా ఉన్న ఇండ్ల వారు ఇందులోకి రావాలని ఇక్కడ మూడు పూటలా భోజనం ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందని తెలిపారు.
అలాగే శిధిలావస్థకు చేరిన ఇండ్లను కూల్చివేయడం జరుగుతుందని, అందులో భాగంగా నిన్న జరిగిన స్పెషల్ డ్రైవ్ లో 38 ఇండ్లను గుర్తించడం జరిగింది.ఇట్టి ఇండ్లలోని వారిని సురక్షిత ప్రాంతానికి లేదా పునరావాస కేంద్రం కు వెళ్ళాలని అవగాహన కల్పించడం జరిగింది. వాటిలో నేడు అత్యంత ప్రమాదకరమైన మూడు ఇండ్లను వాటి యాజమానుల సమ్మతితో మునిసిపల్ జెసిబితో కూల్చివేయడం జరిగిందని ఆయన తెలిపారు.
చైర్మన్ గారి వెంట మండల తహశీల్దార్ శ్రీమతి జ్యోతి గారు,అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీ గోపాల్ గారు, సీనియర్ అసిస్టెంట్ శ్రీ లక్ష్మన్న గారు BRS నాయకులు శ్రీ ఆంజనేయులు గారు మునిసిపల్ వార్డు ఆఫీసర్లు సిబ్బంది తదితరులు ఉన్నారు