ప్రయివేట్,ఎయిడెడ్ పాఠశాలల్లో స్పెషల్ టీచర్లను నియమించేందుకు చర్యలు తీసుకోవలీ జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్

రామన్నపేట 11 సెప్టెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్న ప్రయివేట్, ఎయిడెడ్ పాఠశాలల్లో స్పెషల్ టీచర్ లను నియమించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్ పి ఆర్ డి రామన్నపేట మండల కమిటీ ఆధ్వర్యంలో ఎంఈఓకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎన్ పి ఆర్ డి జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రయివేట్,ఎయిడెడ్ పాఠశాలాలలో లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.కోవిడ్ అనంతరం పిల్లల మానసిక స్థితిలో అనేక మార్పులు వస్తున్నవి.అటిజం,మేదోపరమైన వైకల్యం, సెరిబ్రాల్ పాల్సి,వినికిడి లోపం,అబ్యాస వైకల్యాలు, ప్రవర్తన మరియు భావోద్వేగ వైకల్యం,ఇంద్రియ లోపాలు వంటి అనేక రకాల వైకల్యాలతో విద్యార్థులు తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు.పాఠశాలల్లో విద్యను అభ్యశిస్తున్న విద్యార్థుల ప్రవర్తనను అర్థం చేసుకునేందుకు వీలుగా పిల్లల వైద్యులు, డెవలప్మెంట్ పీడియాట్రీషియన్స్, స్పీచ్ మరియు లాంగ్వెజీ థెరపిస్టులు, అక్యూఫెషనల్ థెరపిస్టులు, బిహేవియర్ థెరపిస్టులు మరియు కౌన్సిలర్స్ నియమించాల్సిన అవసరం ఉంది. 2016 ఆర్.పి.డబ్ల్యూ.డి చట్టంలోని సెక్షన్ 16 ప్రకారం ప్రభుత్వ అనుమతి పొందిన విద్యాసంస్థల్లో వైకల్యం కలిగిన విద్యార్థులకు విద్యాను అందించేందుకు చర్యలు తీసుకోవాలి. వైకాల్యం కలిగిన విద్యార్థుల పట్ల ఎలాంటి వివక్షత చూపకుండా సకలాంగులైన విద్యార్థులతో సమాన ప్రాధాన్యత ఇవ్వాలి.2016 ఆర్.పి.డి చట్టం సెక్షన్ 17(ఏ) ప్రకారం పాఠశాలల్లో వైకాల్యం కలిగిన విద్యార్థులను గుర్తించి, వారి ప్రత్యేక అవసరాలు తెలుసుకుని వాటి పరిష్కారం కోసం కృషి చేయాలి. కానీ రాష్ట్రంలో ఎక్కడ కూడా ప్రయివేట్ మరియు ఎయిడెడ్ విద్యాసంస్థల్లో ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు చదువు చెప్పేందుకు స్పెషల్ టీచర్ లను నియమించడం లేదు.ఇప్పటికే అనేక పాఠశాలల్లో ఆటీజం, మానసిక వైకల్యం, సేరిబ్రల్ పాల్సి వంటి వైకల్యాలు కలిగిన విద్యార్థులకు అడ్మిషన్స్ తీసుకోవడానికి ప్రయివేట్ విద్యా సంస్థల యాజమాన్యలు నిరకరిస్తున్నారు. తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని ప్రభుత్వ అనుమతి పొందిన ప్రతి ప్రయివేట్, ఎయిడెడ్ పాఠశాలల్లో స్పెషల్ టీచర్స్ లను నియమించేందుకు చర్యలు తీసుకోవాలని, వైకల్యం కలిగిన విద్యార్థులు వినియోగించుకునే విదంగా మూత్రశాలలు, మరుగుదొడ్లు, తరగతి గదులలో అవసరమైన ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎన్ పి ఆర్ డి రామన్నపేట మండల కార్యదర్శి గిరికల లింగస్వామి మండల ఉపాధ్యక్షులు నాగు నరసింహ మండల సహాయ కార్యదర్శి పున్న శ్రీధర్ చంద్రశేఖర్ నగరికంటి రమేష్ బొడ్డుపల్లి అంజయ్య క్యాస నాగేష్ తదితరులు పాల్గొన్నారు.