ప్రమాదాలకు నిలయంగా ఖమ్మం హైవే ఫ్లైఓవర్ 

Oct 10, 2024 - 22:11
 0  2
ప్రమాదాలకు నిలయంగా ఖమ్మం హైవే ఫ్లైఓవర్ 
ప్రమాదాలకు నిలయంగా ఖమ్మం హైవే ఫ్లైఓవర్ 

* ఈ సంవత్సరం ఇదే ప్లేస్లో 20 కి మించిన ఆక్సిడెంట్లు 

* రోడ్డున పడ్డ ఎన్నో కుటుంబాలు 

* ఎన్ని ప్రమాధాలు జరిగినా నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టని రోడ్ అధికారులు 
* ఇక్కడ ప్రమాదాలకు సరైన కారణాలు గుర్తించారా...?
* ఇంకెన్ని ప్రమాధాలో...?
* ప్రమాదం జరిగినప్పుడే హడావిడి, తర్వాత లైట్....?
* ఫ్లైఓవర్ దిగేప్పుడు డౌన్ ఎక్కువగా ఉండడం,  రోడ్డు పక్కన కంపచెట్లు,  స్పీడ్ బ్రేకర్లు సరిగా ఏర్పాటు చెయ్యకనే ప్రమాదానికి కారణం అంటున్న స్థానికులు 

అక్టోబర్ 10, గురువారం :  సూర్యాపేట రూరల్ బాలెంలలో ఘోర రోడ్డుప్రమాదం. స్థానిక బాలెంల పెద్దమ్మతల్లి ఫంక్షన్ హాల్ వద్ద కార్ ని డికొట్టిన ఆర్ టీ సి బస్. భద్రాద్రి కొత్తగూడెం కి చెందిన రవీంద్ర పని నిమిత్తం హైదరాబాద్ వెళ్లి తిరుగు ప్రయాణంలో ఖమ్మం హైవే బాలెంల ఫ్లైఓవర్ వద్ద టీ కోసం ఫ్లైఓవర్ కిందకు దిగి జనగాం రోడ్ వైపు వస్తుండగా జనగాం నుండి సూర్యాపేట వెళ్తున్న బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డప్పటికి కార్ పూర్తిగా నుజ్జునుజ్జయింది. ప్రమాదం జరిగినప్పుడు ఘటనా స్థలానికి చేరుకోవడం, అక్కడ ఉండే వీధి వ్యాపారులపై నెపం నెట్టడం తప్పా, ప్రమధాలకి కారణాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలం అవుతున్న అధికారులంటూ స్థానికుల గుసగుసలు. ఈ సందర్బంగా సంఘటన స్థలంలో ఉన్న స్థానికులు మాట్లాడుతూ ఫ్లైఓవర్ దిగే సమయంలో డౌన్ ఎక్కువయ్యింది. అలాగే దానికి కావాల్సిన ఎత్తులో స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చెయ్యకపోవడం అని అన్నారు. అలాగే ఇదే ప్రమాదాన్ని ఉదాహరణగా తీసుకుంటే కారణం ఫ్లైఓవర్ దిగుతున్నప్పుడు డౌన్ ఎక్కువగా ఉండడం, స్పీడ్ కంట్రోల్ కావడానికి సరైన స్పీడ్ బ్రేకర్స్ లేకపోవడం, ముక్యంగా జనగాం - సూర్యాపేట రోడ్ నుండి ఏమొస్తుందో కనిపించకుండా ఉన్న కంపెచెట్లు అని తెలియజేసారు. అధికారులు స్పందించాలు, ప్రేమధానికి కారణాలు విశ్లేషణ చేసి, ఇంకో ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుకున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333