అధికారుల అలసత్వం
మండుతున్న ఎండలకు అగ్నికి ఆహుతి అవుతున్న చెట్లు
కొమ్మలు తొలగింపు ప్రక్రియ పూర్తిస్థాయిలో చేపట్టకపోవడంతో మంటల వ్యాప్తికి కారణం
నిద్రమత్తులో విద్యుత్ అధికారులు
సూర్యాపేట జిల్లా కేంద్రంలో కుడ కుడ కాల్వ వద్ద విద్యుత్ అధికారుల యొక్క సిబ్బంది నిర్వాహకం వల్ల చెట్ల కొమ్మలు విద్యుత్ తీగలకు అనుకోని మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.. అసలే ఎండాకాలం... చెట్ల కొమ్మలను తొలగించాలని ప్రజలు అనేక పలుమార్లు తెలియజేసిన కొమ్మలను తొలగించాలని వారి దృష్టికి తీసుకుపోయిన కొమ్మలు తొలగించకపోవడంతో ఈ ప్రమాదాలు జటిలమవుతున్నాయి.. ఇప్పటికైనా సంబంధిత విద్యుత్ అధికారులు నిద్రమత్తు వదిలి ఎండాకాలంలో దృష్టిలో ఉంచుకొని ఎక్కడైతే ఈ విధంగా సమస్యలు ఉన్నాయో గుర్తించి చెట్ల కొమ్మలను తొలగించి.. అగ్ని ప్రమాదాల భారీ నుండి కాపాడాలని స్థానిక ప్రజలు అధికారులను డిమాండ్ చేస్తున్నారు..