ప్రతి విద్యార్థి హిమాలయాల ఉన్నత శిఖరాలకుఎదగాలి 

Jun 28, 2024 - 20:39
Jun 28, 2024 - 20:42
 0  5
ప్రతి విద్యార్థి హిమాలయాల ఉన్నత శిఖరాలకుఎదగాలి 
ప్రతి విద్యార్థి హిమాలయాల ఉన్నత శిఖరాలకుఎదగాలి 
ప్రతి విద్యార్థి హిమాలయాల ఉన్నత శిఖరాలకుఎదగాలి 
ప్రతి విద్యార్థి హిమాలయాల ఉన్నత శిఖరాలకుఎదగాలి 

 28 జూన్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- నేటి యువతీ యువకులు తల్లిదండ్రులు అధ్యాపకులు చెప్పిన అంశాలను శ్రద్ధ వహించి నిరంతర అధ్యయనం చేస్తూ హిమాలయాల ఉన్నత శిఖరాలకు ఎదగాలని జిల్లా కోర్టు  అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాతి సవేందర్ కుమార్ ఉద్బోధించారు. సంఘమిత్ర ఎడ్యుకేషనల్ చారిటబుల్ సొసైటీ అధ్యక్షులు పూర్వ ప్రభుత్వ న్యాయవాది తల్లమల్ల హసేన్ ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం ఎస్సీ స్టడీ సర్కిల్ సూర్యాపేటలో జ్ఞాన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా నాతి సవేందర్ కుమార్  మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం  గత కొన్ని సంవత్సరాలుగా పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల ఉద్యోగ ఉపాధి కోసం స్టడీ సర్కిల్స్ నిర్వహించటం  హర్షనీయమని అన్నారు.

 ఈ సదావకాశాన్ని ఉపయోగించుకొని విద్యార్థులు కష్టపడి చదువుతూ ఉద్యోగాలు పొంది తమ కుటుంబానికి, దేశానికి రాష్ట్రానికి సేవ చేయాలని అన్నారు.*సంఘమిత్ర ఎడ్యుకేషనల్ చారిటబుల్ సొసైటీ నుండి స్టడీ సర్కిల్ లైబ్రరీ కి పుస్తకాలు, విద్యార్థులకు నోటు పుస్తకాలు, పండ్ల పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో స్టడీ సర్కిల్ డైరెక్టర్ సిహెచ్ రాములు, ప్రభుత్వ న్యాయవాది డప్పు మల్లయ్య, మండల లీగల్ సర్వీసెస్ కమిటీ మెంబర్ ఏడిండ్ల అశోక్, న్యాయవాదుల కోపరేటివ్ సొసైటీ ప్రధాన కార్యదర్శి కోక రంజిత్ కుమార్, ప్రైవేట్ కాలేజ్  లెక్చరర్ బోయిల్ల అఖిల్ ,పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333