సూర్యాపేటలో దొరల రాజ్యం

తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్

Jun 12, 2026 - 00:25
Jun 12, 2026 - 00:44
 0  2
సూర్యాపేటలో దొరల రాజ్యం
సూర్యాపేటలో దొరల రాజ్యం

స్వాతంత్ర్యం వచ్చినా సూర్యాపేటలో దొరల రాజ్యం..

తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్..

సూర్యాపేట 12 జూన్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి :- స్వాతంత్ర్యం వచ్చినా సూర్యాపేటలో దొరల రాజ్యం కొనసాగుతోందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ విమర్శించారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యాలయంలో వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదలు మున్సిపాలిటీ అనుమతులతో ఇళ్లు నిర్మించుకుని పదేళ్లకు పైగా నివసిస్తున్న వెంచర్ల లో అక్రమ పద్ధతుల్లో డాక్యుమెంట్లు సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. వరంగల్‌ లో జరిగిన ఘటనను ఉదాహరణగా ప్రస్తావిస్తూ సూర్యాపేటలో కూడా ఇలాంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపించారు.ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా దొరలు అధికారిక పదవులు లేకపోయినా పాలనను తమ చుట్టూ తిప్పుకుంటూ సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. సూర్యాపేటలో పేదలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు దొరల ఆధిపత్యానికి బలి కావద్దని పిలుపునిచ్చారు. ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వ వ్యవస్థలు సామాన్య ప్రజల ప్రయోజనాల కోసం పనిచేయాలని, కొందరి ప్రయోజనాల కోసం కాకుండా ఉండాలని సూచించారు.

ఇటీవల వజ్ర హోమ్స్, వీవీఎన్ ఎన్‌క్లేవ్ ప్రాంతాల్లో చట్టబద్ధంగా మున్సిపాలిటీకి ఇవ్వాల్సిన పార్కు స్థలాలను అక్రమ పద్ధతుల్లో రిజిస్ట్రేషన్ చేసుకుని నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపించారు. దీంతో అక్కడ నివసిస్తున్న బడుగు బలహీన వర్గాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఈ అంశాలపై సూర్యాపేట మున్సిపల్ కమిషనర్, పోలీసు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే భవిష్యత్తులో జరిగే అక్రమాలకు సంబంధిత అధికారులు కూడా బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.ఈ సందర్భంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ప్రజలు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. జూలై 5న భువనగిరిలో నిర్వహించే సభను విజయవంతం చేసి సామాన్యులకు రాజకీయ అధికారం దక్కేలా కృషి చేయాలని కోరారు. సోషల్ మీడియా ద్వారా ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి లక్షలాది మందికి చేరవేసిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మామిడి అంజయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి మీర్ అక్బర్, టౌన్ అధ్యక్షుడు కుంభం నాగరాజు, ఆత్మకూరు మండల పార్టీ అధ్యక్షుడు బొల్లే సైదులు, మహిళ అధ్యక్షురాలు మంజుల తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333