ప్రతి మహిళా బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కలిగి ఉండాలి కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
సూర్యాపేట అక్టోబర్ 21:- ప్రతి సంవత్సరం విధిగా 35 సంవత్సరాలు నిండిన మహిళలందరూ బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు తీసుకోవాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ సూచించారు. సోమవారం బ్రెస్ట్ క్యాన్సర్ పై మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో చేపట్టిన అవగాహన 2 కె కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది అంటువ్యాధి కాదని దీనిని గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఆయన తెలిపారు. ప్రాథమిక స్థాయిలోనే దీనిని గుర్తించడం ద్వారా నివారించుకునే అవకాశం ఉందని అన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ అనేది కొందరికే కాదని ఎవరికైనా రావచ్చునని కనుక విధిగా 35 సంవత్సరాల నుండి మహిళ విధిగా ప్రభుత్వ ఆసుపత్రులలో స్క్రీనింగ్ టెస్ట్ , మెమోగ్రామ్ ఉచితంగా చేస్తున్నట్లుతెలిపారు. అనంతరం మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జయలత మాట్లాడుతూ.... 1985 అక్టోబర్ నుండి, నేషనల్ బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన నెలగా నిర్వహిస్తోందన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్కు ఐదు రకాల ట్రీట్మెంట్లు ఉంటాయని, మామూలుగా అయితే సర్జరీయే ట్రీట్మెంట్ అని అయితే క్యాన్సర్ దశలను బట్టి కీమోథెరపీ, రేడియేషన్ వంటి ట్రీట్మెంట్లు చేస్తారు. వాటి తోపాటు హార్మోన్ థెరపీ, టార్గెట్ థెరపీ అనే సిస్టమిక్ ట్రీట్మెంట్లు ఉంటాయని చెప్పారు. మెడికల్ కళాశాల నుంచి మినీ ట్యాంక్ బండ్ వరకు నిర్వహించిన కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో వైద్యులు శ్రీకాంత్ భట్, సత్యనారాయణ, రమేష్, యశ్వంత్, ఈశ్వరమ్మ, రాకేశ్ చంద్ర, పావని, రూత్, సునీత, భూలక్ష్మి లు పాల్గొన్నారు.