ఇటిక్యాల మండలం ఎమ్మార్వో పై దాడి చేసిన నిందితులను రిమాండ్ చేయాలని

జిల్లా ఎమ్మార్పీఎస్ దళిత ఐక్యవేదిక ఉద్యోగ సంఘం నాయకుల  డిమాండ్

Nov 3, 2024 - 16:28
 0  96
ఇటిక్యాల మండలం ఎమ్మార్వో పై దాడి చేసిన నిందితులను రిమాండ్ చేయాలని

జోగులాంబ గద్వాల 3 నవంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- ఇటిక్యాల మండలం దళిత సామాజిక వర్గానికి చెందిన ఎమ్మార్వో బి నరేందర్ తన కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో మునగల గ్రామానికి చెందిన ప్రభాకర్ రెడ్డి వారి అనుచరులు దాడి చేసిన సంఘటనపై ఖండిస్తూ ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ పోగుల రాజేష్ మాదిగ జిల్లా దళిత ఐక్యవేదిక ఉద్యోగ సంఘం నాయకులు ఆర్ హనుమంతు మోహన్ పౌర హక్కుల సంఘం నేత సుభాన్,దళిత జర్నలిస్ట్ ఫోరమ్ తెలుగు రాష్ట్రాల సలహాదారుడు మాట్లాడుతూ పాల్వాయి ఎస్ రంజిత్ కుమార్ మాట్లాడుతూ ఇటిక్యాల మండలం ఎమ్మార్వో బి  నరేందర్ గారు విధి నిర్వహణలో భాగంగా తన కార్యాలయంలో ఉన్న సమయంలో అదే మండలం మునగాల గ్రామానికి చెందిన ప్రభాకర్ రెడ్డి కొంతమంది ఆయన అనుచరులు ఎమ్మార్వో బి నరేందర్ గారి పైన దాడి చేస్తూ కులం పేరుతో దూషించి అత్యాయత్నానికి పాల్పడిన పై నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఇటిక్యాల మండల ఎస్సై వెంటనే నిందితులు ఎక్కడున్నా గానీ త్వరగా అరెస్టు చేసి రిమాండ్ డిమాండ్ చేశారు. అదేవిధంగా దళితులపైన గాని దళిత అధికారుల పైన గాని అగ్రకుల పెత్తందారులు ఎవరు దాడి చేసిన గాని జిల్లా పోలీస్ శాఖ వెనివెంటనే స్పందించి దళిత బాధితులకు న్యాయం చేయాలని కోరారు ఎమ్మార్వో పైన దాడి చేసిన ప్రభాకర్ రెడ్డి వారి అనుచరులను వెంటనే అరెస్టు చేసి రిమాండ్ కు పంపని సమయంలో జిల్లా ఎమ్మార్పీఎస్ జిల్లా దళిత ఉద్యోగ సంఘం ప్రజా సంఘాలతో కలిసి ఎలాంటి కార్యక్రమం చేపట్టడానికైనా వెనుకాడబోమని అన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333