ప్రజా ప్రభుత్వం లో అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి సంక్షేమ పధకాలు
ప్రజా ప్రభుత్వం లో అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి సంక్షేమ పధకాలు
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ గుమ్మడి సోమయ్య
తెలంగాణ వార్త ఏప్రిల్ 02:- రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి & స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు గౌరవనీయులు శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క ఆదేశాల మేరకు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడకుల అశోకన్న సూచనల మేరకు,
మంగపేట మండలం లోని మేజర్ గ్రామ పంచాయతీ కమలాపురం గ్రామం లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా తీసుకున్న ప్రజా పాలనా ప్రగతి ప్రణాళిక గ్రామ సభకు హాజరైన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ గుమ్మడి సోమయ్య మాట్లాడుతూ... ప్రజా ప్రభుత్వం చే 99 రోజుల ప్రణాళిక లో గ్రామ సభలు ఈరోజు నుండి మొదలు అవ్వగా ప్రభుత్వం లో ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాలు అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి అధికారులచే పర్యవేక్షణ చేసి అందరికి లబ్దిచేకురెలా సంబంధిత అధికారుల దృష్టికీ తీసుకెళ్లి సమస్య పరిష్కారం అయ్యేలా నిర్ణయం తీసుకుంటారు అదేవిధంగా గ్రామాలలో నెలకొన్న సమస్యలు ఆయా గ్రామాల పంచాయతీ సెక్రటరీ ల దృష్టికీ ప్రజా పాలనా ప్రగతి ప్రణాళిక దరఖాస్తు ద్వారా తీసుకెళ్తే అన్ని సమస్యలకు కచ్చితంగా పరిష్కారం లభిస్తుంది అని తెలియజేశారు ఈ కార్యక్రమం లో... మండల తహసీల్దార్ తోట రవీందర్ తో పాటుగా అన్ని శాఖల అధికారులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు...