జానకిపురం బిక్కిరు వాగు నుండి అక్రమ ఇసుక రవాణా
పట్టించుకోని ప్రభుత్వ అధికారులు,గ్రామ పాలకులు
అడ్డగూడూరు 02 ఏప్రిల్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– అడ్డగూడూరు మండల పరిధిలోని జానకిపురం గ్రామం బిక్కేర్ వాగు నుండి తాటిపాముల గ్రామం నుండి వందలకొద్ది ట్రాక్టర్లతో ఇసుకను తోడేస్తున్నారు. వాగులు నమ్ముకుని వందల మంది రైతులు జీవనం సాగిస్తున్నారు అయితే వాగు నుండి ఇసుకను తరలించవద్దని అనేకమార్లు రైతులు ప్రభుత్వ అధికారులకు, గ్రామ పాలకులకు ఫిర్యాదు చేసిన ఫలితం శూన్యం.ఇట్టి విషయాన్ని జానకిపురం గ్రామ పరిరక్షణ సొసైటీ ఆధ్వర్యంలో మండల ఎమ్మార్వో కి గ్రామ సర్పంచ్ కి తెలియజేశారు.కానీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది కనుక తక్షణమే జిల్లా అధికార యంత్రాంగం ఇట్టి విషయాన్ని పరిశీలించి బిక్కేరు నుండి ఇసుక తరలించకుండా చూడాల్సిందిగా జానకిపురం గ్రామ పరిరక్షణ సొసైటీ సభ్యులు తెలియజేశారు.
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామ బిక్కేరు వాగు నుండి ఇసుకను తీయుటకు అనుమతులు తీసుకొని, అడ్డగూడూరు మండలం జానకిపురం బిక్కీరు వాగు నుండి వందల కొద్ది ఇసుక ట్రాక్టర్లను తాటిపాముల గ్రామం నుండి తరలించడం జరుగుతుంది . ఇప్పటికైనా అడ్డగూడూరు మండల ఎమ్మార్వో సంబంధిత అధికారులు, గ్రామ సర్పంచ్, ఇట్టి అక్రమ ఇసుకను నిలిపివేయాల్సిందిగా గ్రామ రైతులు, వారి పక్షాన గ్రామ సొసైటీ పోరాటం చేస్తుందని ఆ సొసైటీ సభ్యులు తెలియజేశారు. లేని పక్షంలో ఇట్టి విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని మండల గ్రామ ప్రభుత్వాధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు సొంత గ్రామంలో ఇసుక ఉన్న మండల అధికారుల పర్మిషన్ తప్పనిసరి అని చెప్పే ప్రభుత్వ అధికారులు ఇట్టి విషయాన్ని పట్టించుకోవడం దురదృష్టకరమని ఇప్పటికైనా అడ్డగూడూర్ మండల ప్రభుత్వ అధికారులు జానకిపురం గ్రామ సర్పంచ్ ఇట్టి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని తగిన చర్యలు చేపట్టవలసిందిగా గ్రామ రైతుల పక్షాన గ్రామ పరిరక్షణ సొసైటీ అధ్యక్షులు గుడిశాల యాదగిరి గౌడ్, ఉపాధ్యక్షులు ననుబోతూ పరుశరాములు యాదవ్, జనరల్ సెక్రెటరీ నన్నుబోతు రాము యాదవ్, సొసైటీ సభ్యులు గ్రామస్తులు అధికారులకు పలుమార్లు చెప్పిన నిమ్మకు నీరు ఎత్తినట్లు వ్యవహరిస్తున్నారు అని అన్నారు.