ప్రజా పాలనలో మహిళలకు పెద్దపీట
తిరుమలగిరి 05 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామపంచాయతీలో మహిళా సంఘాలకు ప్రభుత్వం అందిస్తున్న కమిషన్ చెక్కులను 8వ వార్డు గ్రామపంచాయతీ వార్డు మెంబర్ చిలుకల లక్ష్మి రూ.1,52,000/-, అలాగే V.O. ఆకుల సరస్వతి రూ.92000/- కమిషన్ చెక్కులను,గ్రామ సర్పంచ్ కుంభం మంజుల సతీష్ గౌడ్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేస్తూ, మహిళలకు ఉపాధి, ఆర్థిక స్వావలంబన మరియు స్వయం సమృద్ధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమైనవి మహిళల చేతుల్లో ఆర్థిక సాధికారత రైతులకు అండగా వడ్ల కొనుగోలు కేంద్రాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలోపేతం ఇదే ప్రజా సంక్షేమ ప్రభుత్వ లక్ష్యం అన్నారు ఈ కార్యక్రమంలో , కుంభం సతీష్ గౌడ్ , సట్టు శంకర్ , బొమ్మేరి యాకన్న , మహిళా సంఘం అధ్యక్షురాలు పులిమామిడి శోభ కార్యదర్శి చిత్తలూరు జ్యోతి , ఏపూరి మంజుల , వార్డు సభ్యులు, మహిళా సంఘాల సభ్యులు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు