ప్రజా పాలనకు పాలాభిషేకం
తెలంగాణ వార్త ఆత్మకూరు యస్:- ప్రజా పాలనకు పాలాభిషేకం తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి కళాకారులకు గత ప్రభుత్వం 583 మంది కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చి వారికి స్వరాష్ట్రంలో తగిన గౌరవం అందించింది గత పది సంవత్సరాల నుండి 24,514 రూపాయల గౌరవ వేతనం ఇచ్చి వారికి తగిన స్థానాన్ని ఇచ్చింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన అంటే ఏమిటో నిరూపించుకుంది 583 మంది కళాకారులకు పిఆర్సి పెంచి 24,514 ఉన్న జీతాన్ని 31,868 రూపాయలకు పెంచి కళాకారుల జీవితాల్లో వెలుగులు నింపింది. కళాకారులకు సముచిత స్థానాన్ని ఇచ్చి వారిని జీవితాల్లో వెలుగులు నింపినటువంటి ముఖ్యమంత్రి గౌరవ శ్రీ.ఎనుముల రేవంత్ రెడ్డి గారికి, మరియు ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రివర్యులు బట్టి విక్రమార్క గారికి, సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు గౌరవ శ్రీ.జూపల్లి కృష్ణారావు గారికి, సూర్యాపేట జిల్లా స్థానిక మంత్రులు అయినటువంటి గౌరవ శ్రీ.ఉత్తంకుమార్ రెడ్డి గారికి, గౌరవ శ్రీ.కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, భాష సంస్కృతిక శాఖ మామిడి హరికృష్ణ గారికి, విజయ్ కుమార్ సార్ గారికి తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు సూర్యాపేట జిల్లా టీం లీడర్ పాక ఉపేందర్ ఆధ్వర్యంలో దండు మైసమ్మ సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి పాలాభిషేకం చేసి ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా. సాంస్కృతిక సారధి కళాకారులు మాగి శంకర్, వెన్నెల నాగరాజు,ఈర్ల సాయి, గడ్డం ఉదయ్,పాలకుర్తి శ్రీకాంత్,మేడిపల్లి వేణు,గజ్జి మంజుల, సిరిపంగి రాధ, నెమ్మది స్రవంతి,పోతరాజు శిరీష కళాకారులు తదితరులు పాల్గొన్నారు...