ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్నివిజయవంతం చేద్దాం

May 2, 2026 - 20:29
 0  1
ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్నివిజయవంతం చేద్దాం

ప్రజాప్రతినిధులు.. అధికారులు సమన్వయంతో పని చేసి 99 రోజుల కార్యాచరణతో సత్ఫలితాలు సాధించాలి. 

ఈరోజు  శ్రీ చెలికాని ఆదెమ్మ గారి ఫంక్షన్ హాల్ సమావేశమందిరం లో జరిగిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక సన్నాహక సమావేశానికి ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గారు స్థానిక ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ అధికారులతో కలిసి పాల్గొనడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం ప్రజలకు మరింత మేలైన పాలన అందించాలనే లక్ష్యంతో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దానిలో భాగంగా నిర్వహించిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక సన్నాహక సమావేశంలో ప్రజాప్రతినిధులకు, అధికారులకు దిశానిర్దేశం చేయడం జరిగింది,99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహించే ప్రతి కార్యక్రమాలను అధికారులు అంకిత భావంతో పని చేసి  విజయవంతం చేయాలి. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలి.ప్రజాపాలన-పట్టణ ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో  పారిశుధ్యం మరియు ఆరోగ్యం, అరైవ్ అలైవ్ (రోడ్డు భద్రత), సంక్షేమం, పిల్లల రక్షణ మరియు డ్రగ్స్ నిర్మూలన, రైతు సంక్షేమం మరియు వ్యవసాయం, విద్య, యువత మరియు క్రీడలు, మహిళా సాధికారత, పర్యావరణ పరిరక్షణ  వంటి అంశాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. నియోజకవర్గ అభివృద్ధి కోసం చేసే ఈ ప్రణాళికలో అధికార, ప్రతిపక్ష పార్టీలనే భేదం లేకుండా అందరు భాగస్వాములవ్వాలి. ముఖ్యంగా విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో అధికారులు మరింత శ్రద్ధ వహించి ప్రభుత్వ ఆలోచనలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. ప్రజాప్రతినిధుల సహకారంతో స్థానికంగా చేయవలసిన అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలను అందజేస్తే, ప్రాధాన్యత ఆధారంగా ప్రభుత్వం నిధులను కేటాయించడానికి సిద్ధంగా ఉంది. 99 రోజుల అభివృద్ధి ప్రణాళికలో ప్రజా సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు ఈ శిక్షణ కార్యక్రమంలో నూతన ప్రజాప్రతినిధులకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ కార్యక్రమంలో సర్పంచులు,అధికారులు,మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు….

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333