ప్రజల సమస్యల చట్టపర పరిష్కారానికి తక్షణ కృషి.

Mar 16, 2026 - 22:00
Mar 16, 2026 - 22:01
 0  0
ప్రజల సమస్యల చట్టపర పరిష్కారానికి తక్షణ కృషి.

కె నరసింహ ఐపిఎస్, ఎస్పి సూర్యాపేట జిల్లా.

సూర్యపేట, 17  మార్చి 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- పోలీసు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పి నరసింహ  జిల్లా పోలీస్ కార్యాలయం నందు పిర్యాదుదారులతో మాట్లాడినారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి వచ్చిన పిర్యాదుదారుల నుండి పిర్యాదులు స్వీకరించారు. ప్రజల సమస్యల పరిష్కారానికై సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా తక్షణ ఆదేశాలు, సూచనలు చేసి సమస్యల పరిష్కారానికి అవసరమైన దిశానిర్దేశం చేశారు. ప్రజల సమస్యలపై త్వరితగతిన చట్టపరమైన చర్యలు తీసుకుని బాధితులకు బరోసా కల్పించాలి అన్నారు.

ఎలాంటి సమస్యలు ఉన్న ప్రజలు పైరవీలు లేకుండా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా, నిర్భయంగా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. చట్టబద్ధమైన విధానంలోనే ప్రజలకు న్యాయం జరుగుతుందని, శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజలకు మరింత చేరువగా ఉండడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333