ప్రజల ప్రాణాల కార్పొరేటర్ ల లాభాల ? CPM
జోగులాంబ గద్వాల 11 జూన్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : ధరూర్ ప్రభుత్వానికి ప్రజల ప్రాణాల ముఖ్యమో లేకపోతే కార్పొరేటర్ల లాభాలు ముఖ్యమో తేల్చుకోవాలని అని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఉప్పేర్ నరసింహ అన్నారు జిల్లా కమిటీ పిలుపు మేరకు బుధవారం ధరూర్ మండల కేంద్రంలో ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని ఏ ప్రభుత్వానికైనా ప్రజల ప్రాణాలు పర్యావరణ పరిరక్షణ ముఖ్యమని కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రజల ప్రాణాలను పణంగా పెట్టీ పర్యావరణ పరిరక్షణకు తిలోదకాలు ఇచ్చి జీవావరణ వ్యవస్థను ధ్వంసం చేయడానికి రాజోలి మండలం పెద్ద ధన్వాడ గ్రామంలో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు నిరంకుశంగా ముందుకు వెళుతున్నదని విమర్శించారు. ప్రైవేటు సైన్యం ద్వారా రైతులపై ప్రజలపై దాడి చేసిన కంపెనీ యాజమాన్యాన్నీ వదిలేసి, రైతులపై అక్రమ కేసులు బనాయించి వారిని జైల్లో పెట్టారని విమర్శించారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు కంపెనీ యాజమాన్యానికి వత్తాసుగా మాట్లాడడం దుర్మార్గమని అన్నారు.రైతులకు కార్పొరేట్ శక్తులకు మధ్య జరుగుతున్న పోరాటాన్ని కులాల కుంపటిగా మార్చి రాజకీయ లబ్ధి పొందే ఆర్ కృష్ణయ్య నీచ బుద్ధిని బీసీ సమాజం ఒప్పుకోదని అన్నారు.ప్రజాస్వామ్యానికి ప్రజల హక్కులకు భంగం వాటిలినప్పుడు రాజకీయ పార్టీలు సామాజిక ప్రజా సంఘాలు ముందుకు రావడం సహజమని కానీ ప్రజాస్వామ్య వ్యవస్థను అపహస్యం చేస్తూ, రైతులను పరామర్శించి దైర్యం చెప్పడానికి వెళుతున్న స్థానిక రాజకీయ పార్టీలను సామాజిక ప్రజాసంఘాలను నిర్బంధంలోకి తీసుకోవడం అన్యాయమన్నారు. సంఘటనతో సంబంధం లేని వారిని కూడా అక్రమంగా కేసులో ఇరికించి సాధారణ ప్రజలను ఉద్యమాల్లోకి రావాలంటేనే భయపడే విధంగా నిరంకుశత్వంతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు.నిర్బంధాల ద్వారా ప్రజా పోరాటాలను ఆపలేరని,తక్షణమే ఇథనాల్ పరిశ్రమకు ఇచ్చిన అనుమతులు రద్దుచేసి,కంపెనీ యాజమాన్యంపై కేసులు నమోదు చేసి, రాజోలి SI పై విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, అరెస్టు చేసిన రైతులను విడుదల చేయాలని ధన్వాడ గ్రామంలోకి రాజకీయ పార్టీలు సామాజిక ప్రజాసంఘాలకు పరామర్శించడానికి అనుమతి ఇవ్వాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మేకల నరసింహులు మోష వినయ్ ఆంజనేయులు దేవదాస్ ప్రవీణ్ తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు.