పోలీసు ప్రతిష్టను కించపరిచేలా పోస్ట్లు పెడితే చట్టపరంగా చర్యలు తప్పవు

Jan 30, 2026 - 14:22
Jan 30, 2026 - 14:24
 0  26

తెలంగాణ వార్త సూర్యాపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కార్యాలయం 30-01-26:

ఆత్మకూరు పోలీస్ స్టేషన్ లో నమోదైన హత్యాప్రయత్నం కేసుపై తప్పుడు ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో ఆవాస్తవాలు ప్రచారం చేస్తున్న ఏ1 నిందితుడి పై రౌడీ షీటర్..

ఆత్మకూరు (ఎస్) పోలీస్ స్టేషన్ పరిధి నవంబర్ 18 వ తారీఖున హత్యాప్రయత్నంకు సంబంధించి బాధితుడు జటంగి రాకేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అత్యాప్రయత్నం కేసు నమోదు చేయడం జరిగినది. పారదర్శకంగా దర్యాప్తు జరిపి ఈ కేసులో కొంత మంది నిందితులపై కేసు నమోదు చేయడం జరిగినది. బాధితుడు పిర్యాదు ఆధారంగా ఆత్మకూరు మండలం పాతర్లపాడ్ గ్రామానికి చెందిన ఏ1 జటంగి సురేష్, ఏ2 బండపల్లి విఘ్నేష్, ఏ3 మహేందర్ అనే ముగ్గురిని ప్రాధమిక నిందితులుగా గుర్తించడం జరిగింది. ఇందులో నిందితుడు ఏ2 విఘ్నేష్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తలరిలించగా మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు ఏ1 జటంగి సురేష్ పై ఆత్మకూరు పోలీస్ స్టేషన్ నందు గతంలో రౌడీషీట్ నమోదై ఉన్నది. ఏ1 నిందితుడైన జటంగి సురేష్ తనపై తప్పుడు కేసు నమోదు చేశారని, బెయిల్ ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించగా గౌరవ హైకోర్టు నిందితుడి పిటిషన్ కొట్టివేయడం జరిగింది. హత్యాప్రయత్నం కేసు దర్యాప్తులో ఉండగా పరారీలో ఉన్న ఏ1 నిందితుడు జటంగి సురేష్ సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ఈ కేసు పై, ఆత్మకూరు పోలీస్ పై, ఎస్సై శ్రీకాంత్ పై అసత్య ప్రచారాలను చేస్తూ పోస్టులు పెడుతున్నాడు, ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దు. కేసుకు సంబంధించిన వాస్తవాలను తప్పుదోవ పట్టించేలా, పోలీసు ప్రతిష్టను కించపరిచేలా పోస్ట్లు పెడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సూర్యాపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ హెచ్చరించారు.

Santosh chakravarthy తెలంగాణ వార్త సీనియర్ జర్నలిస్టు 8500686136