పోలీసు కళాబృందాలచే ఎన్నికల నియమావళి పై అవగాహన

May 7, 2024 - 20:38
 0  8
పోలీసు కళాబృందాలచే ఎన్నికల నియమావళి పై అవగాహన

మునగాల 07 మే 2024

తెలంగాణ వార్తా ప్రతినిధి ;-

ఎస్పీ రాహుల్ హెగ్డే ఐపిఎస్  ఆదేశాల మేరకు మునగాల SI వెంకన్న గౌడ్  నరసింహులగూడెం గ్రామం లో పోలీసు కళాభృందం అధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది.

మహిళల, విద్యార్థుల రక్షణ, చట్టాలు, విద్యా విధానాలు, సమస్యలను అధిగమించడం, సోషల్ మీడియా, ఇంటర్నెట్ సద్వినియోగం లాంటి అంశాలపై మరియు విద్యార్థులు ఒత్తిడి అధిగమించి లక్ష్యాలను చేరుకోవాలి, లక్ష్యం కోసం కృషి చేయాలని పోలీస్ కళాబృందం సభ్యులు పాటల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది.

మునగాల పోలీస్ స్టేషన్ ASI శ్రీనివాసరెడ్డి, మాట్లాడుతూ జిల్లా ఎస్పి రాహుల్ హెగ్డే ఐపిఎస్  అధ్వర్యంలో మహిళల రక్షణపై పటిష్టంగా పని చేస్తున్నామని,గ్రామాల్లో ఎలాంటి సమస్యలు వచ్చినా శాంతి భద్రతలకు ఆటంకం కలిగించకుండా పరిష్కారం చేసుకోవాలి చట్టాలను చేతుల్లోకి తీసుకోకుండా వాటిని గౌరవించి పోలీస్ వారికి తెలియపరచాలి. ఇంటర్నెట్ ను సద్వినియోగం చేసుకోవాలి, సోషల్ మీడియాలో ఎవరినైనా ఉద్దేశించి అభ్యంతరకరమైన పోస్టులు పెట్టరాదు.సైబర్ మోసగాళ్ళ వల్ల మోసాలకు గురి కావద్దు, వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ ఖాతా, ATM కార్డ్ వివరాలు, OTP వివరాలు ఇతరులకు తెలపవద్దు, ఇతరులు ఆశ చూపితే వాటికి ఆకర్షితులు కావద్దు, యువత చెడు వ్యసనాల బారిన పడొద్దు అని తెలిపినారు. మెసేజ్ లలో వచ్చే బ్లూ లింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దు అని కోరినారు. సైబర్ మోసాలపై 1930 టోల్ ఫ్రీ నంబర్ కు పిర్యాదు చేయాలని అన్నారు. అలాగే వేధింపులపై 100 కు సమాచారం ఇవ్వాలని తెలిపినారు.పోలీసు కళబృందం వారు సాంస్కృతిక, జానపద కార్యక్రమాలతో సామాజిక అంశాలపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమం నందు పోలీస్ సిబ్బంది కానిస్టేబుల్ శివ కోటేశ్వరరావు కళాబృందం ఇంచార్జ్ యల్లయ్య, గోపి, క్రిష్ణ,చారి,గురులింగం మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

A Sreenu Munagala Mandal Reporter Suryapet District Telangana State