పోలీసులు, రెవిన్యూ అధికారులు న్యాయం చేయాలి :వెన్న పూలమ్మ
తెలంగాణ వార్త సూర్యపేట 29-01-26:
పోలీసులు, రెవెన్యూ అధికారులు న్యాయం చేయాలని బా ధితురాలు వెన్న పూలమ్మ డిమాండ్ చేశారు. గురువారం సూర్యాపేట ప్రెస్ క్లబ్ లో విలేకరు లతో మాట్లాడారు.
పెనపహడ్ మండలం చీదేళ్ల గ్రామానికి చెందిన వెన్న పూలమ్మ మాట్లాడుతు కుప్పిరెడ్డి గూడెం గ్రామానికి చెందిన మందడి శ్రీ రాంరెడ్డి కుమార్తె ను. వివాహ సమయం లో 1.20 ఎకరాల భూమిని పసుపు కుంకుమల కింద ఇచ్చారని పేర్కొన్నారు. ఆ తర్వాత మరో రెండు ఎకరాల భూమి ని కొనుగోలు చేశానాన్నారు. ముడున్నారా ఎకరాల భూమి ని కౌలు కు ఇస్తునామని చెప్పారు. 119 సర్వే నెంబర్ లోని 2.20 ఎకరాలు ఉందనారు. మరో నెంబర్ లో 1.30 భూమి ఉంద న్నారు. మా తమ్ముళ్లు మందడి గోపాల్ రెడ్డి, మందడి పద్మారెడ్డి భూమి వద్దకు రాకుండా కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు అన్ని ఆధారాలు చూపించిన పట్టించు కోవడం లేదని బోరున విలపించారు. కలెక్టర్, sp స్పందించి న్యాయం చేయాలని కోరారు. అధికారులు స్పందించక పోతే మానవ హక్కుల కమీషన్ లో పిర్యాదు చేస్తన్నారు.