పోలీసులతో ప్రజలు మమేకమై ఉండడం కొరకే పోలీస్ ప్రజా భరోసా
పట్టణ సిఐ పి.వీర రాఘవులు

సూర్యాపేట, 4 ఏప్రిల్ 2025 తెలంగాణవార్త ప్రతినిధి:-
పోలీసులతో ప్రజలు మమేకమై ఉండడం కొరకే పోలీస్ ప్రజా భరోసా అని పి. వీరరాఘవులు అన్నారు. బుధవారం రాత్రి సూర్యాపేట జిల్లా ఎస్పీ నర్సింహ ఆదేశాల మేరకు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 23వ వార్డు రాజీవ్ నగర్ చౌరస్తా వద్ద ఏర్పాటుచేసిన పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమాన్ని నిర్వహించి మాట్లాడారు మొట్టమొదటగా పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమాన్ని రాజీవ్ నగర చౌరస్తాలో ఏర్పాటు చేయడం జరిగిందని యువత చెడు అలవాట్లకు పాల్పడకుండా ఉండాలని తెలిపారు. యువత పోలీస్ రికార్డులలో ఒక్కసారి పేరు నమోదైతే భవిష్యత్తులో ఉద్యోగాలు,విదేశాలకు వెళ్లే విషయంలో పాస్పోర్ట్, వీసా పొందే అనుమతులు ఉండవని ఎప్పటికీ అలాగే నిలిచిపోతుందన్నారు. మహిళలను వేధిస్తే కేసులు నమోదు చేసి జీవితకాలం శిక్ష పడేలా పోలీస్ దర్యాప్తు ఉంటుందని తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడపద్దని చిన్నపిల్లలకు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు బాధ్యతలు తీసుకోవాలని, గంజాయి,మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ లాంటి అలవాట్లు పడితే జీవితాలను పాడు చేసుకోవద్దని తెలిపారు. సైబర్ మోసాలకు గురి కాకుండా బెట్టింగ్ ప్రకటనలు నమ్మి డబ్బులు బెట్టింగ్ పెట్టి అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకోవద్దని తెలిపారు.బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం లాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ వన్ టౌన్ ఎస్సై ప్రవీణ్,ఏ ఎస్ఐ వెంకన్న,స్థానిక వార్డు నాయకులు వల్దాస్ జానీ,వల్దాస్ దేవేందర్, వల్దాస్ ఉపేందర్,ఐడి పార్టీ కరుణాకర్, కృష్ణ, సైదులు, మధు, సొందు, మేఘ్య తదితరులు పాల్గొన్నారు.