పొంచి ఉన్న ప్రమాదం... వాహనదారులకు అడ్డుగా ఉన్న ఫ్లెక్సీలు

Jun 19, 2026 - 22:04
Jun 19, 2026 - 22:04
 0  1
పొంచి ఉన్న ప్రమాదం... వాహనదారులకు అడ్డుగా ఉన్న ఫ్లెక్సీలు
పొంచి ఉన్న ప్రమాదం... వాహనదారులకు అడ్డుగా ఉన్న ఫ్లెక్సీలు

గద్వాలలో ట్రాఫిక్‌కు అడ్డుగా బోర్డులు... ప్రమాదాలకు నిలయంగా మారిన ఫ్లెక్సీలు

 జోగులాంబ గద్వాల 19 జూన్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- గద్వాల పట్టణంలోని ప్రధాన కూడలి వద్ద ఏర్పాటు చేసిన భారీ సర్క్యులర్ బోర్డు ఫ్లెక్సీ వాహనదారులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. ఈ బోర్డు కారణంగా సర్కిల్‌లోకి వచ్చే వాహనాలు సరిగ్గా కనిపించకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అదేవిధంగా, కూడలిలో ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి అడ్డుగా భారీ బ్యానర్ కట్టారు. ఇది మహనీయుడి విగ్రహాన్ని కనిపించకుండా చేస్తోందని, ఆయన గౌరవానికి భంగం కలిగిస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్‌కు అడ్డుగా ఉన్న ఈ ఫ్లెక్సీ బోర్డును వెంటనే పక్కకు జరిపి, అంబేద్కర్ విగ్రహానికి అడ్డుగా ఉన్న బ్యానర్‌ను తొలగించాలని ప్రజలు, కోరుతున్నారు

 మున్సిపాలిటీ అధికారులు స్పందించి అక్కడ ఉన్నటువంటి బ్యానర్ ను పక్కకు పెట్టగలరని పట్టణ ప్రజలు కోరుతున్నారు.


,ఇష్టానుసారంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై కలెక్టర్ ఆగ్రహం. ఫ్లెక్సీ లను తొలగించాలంటే మున్సిపల్ కమీషనర్ కు ఆదేశాలు జారీ. 

గురువారం రోజు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్  గద్వాల పట్టణంలో ఎరువులు, విత్తనాల షాపులను ఆకస్మికంగా తనిఖీ చేసిన సందర్భంలో మాట్లాడుతూ..గద్వాల పట్టణంలోని ప్రధాన రహదారులు, ముఖ్యమైన కూడలల్లో ఇష్టానుసారంగా ఫ్లెక్సీలను  ఏర్పాటు చేయడంపై సంబంధిత అధికారులపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతులు లేకుండా ఏర్పాటు చేసే ప్రకటనలపై బోర్డులను తొలగించాలని ఫ్లెక్సీల కారణంగా ఇబ్బందులు ఉన్నందున వెంటనే తీసివేయించాలని మున్సిపల్ కమిషనర్ జానకి రామ్ సాగర్ కు సూచించారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State