బాదే రామన్నకు జోహార్లు అర్పించిన న్యూడెమోక్రసీ నేతలు
సూర్యాపేట, 19 జూన్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ :- సిపిఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ ఉమ్మడి నల్లగొండ జిల్లా కమిటీ సభ్యులు కోదాడ పార్టీ డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ బాదేరాము రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆయన వర్ధంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని చండ్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రం నందు ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించి ,రెండు నిమిషాలు మౌనం పాటించారు.
ఈ సందర్భంగా ఎం. డేవిడ్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ చిన్న వయసు నుండి మార్క్సిస్టు లెనినిస్టు రాజకీయాలను అలవర్చుకొని ఈ వ్యవస్థ మార్పు కోసం అనేక పోలీస్,గ్రామ పెత్తందారుల నిర్బంధాలను ఎదుర్కొంటూ పూర్తి కాలపు కార్యకర్తగా ఎదిగి రైతు కూలీ సంఘానికి జిల్లా ప్రధాన కార్యదర్శిగా, పార్టీకి జిల్లా కమిటీ సభ్యుడిగా ఎదిగిన చరిత్ర ఉన్నదని ఆయన ఆశయాల సాధన కోసం నేటి యువతరం పోరాడాల్సిన అవసరం ఏర్పడిందని ఆయన కొనియాడారు. ఆయన ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరు ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి గంటా నాగయ్య, ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు కునుకుంట్ల సైదులు, ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు శంకర్, పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు పుల్లూరి సింహాద్రి, పార్టీ టౌన్ నాయకులు పెద్దింటి అశోక్ రెడ్డి,వెంకన్న తదితరులు పాల్గొన్నారు.