పేదల భూములు గుంజుకోవద్ధు
-సీపీఎం అడ్డగూడూరు మండల కార్యదర్శి బుర్రు అనిల్ కుమార్
అడ్డగూడూరు 19 ఏప్రిల్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– అభివృద్ధి పేరుతో 80 ఎకరాలు పట్టా భూమిని తీసుకోవడం అన్యాయం ఏండ్ల నుంచి 165 సర్వే భూమిలో 50 ఎకరాల్లో గంగాదేవి గుడి,మరో 50 ఎకరాల్లో నల్లగుట్ట భూమి భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు అడ్డగూడూరు మండల కమిటీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి 165 సర్వే నెంబర్ భూమిని పరిశించడం జరిగింది.ఈ సందర్భంగా సీపీఎం అడ్డగుడూర్ మండల కార్యదర్శి బుర్రు అనిల్ కుమార్ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం లో ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పేద మధ్యతరగతి ప్రజలను ఆసరాగా తీసుకుని వందల ఎకరాల భూములను బలవంతంగా లాకోవడం అన్యాయం అన్ని అన్నారు అడ్డగుడూర్ మండల పరిధిలోని డి.రేపక గ్రామంలో ఉన్న 165 సర్వే నెంబర్ లో మొత్తం 180 ఎక్కరాలకు 50 ఎకరాలు గంగాదేవి గుడి పరిధిలో ఉన్న గుట్ట 50 ఎకరాలు అదే విధంగా నల్ల గుట్ట 50 ఎకరాలు ఉంది మిగతా 80 ఎకరాలు రైతులు ఎన్నో ఏండ్లుగా పంట పొలాన్ని చేసుకుంటూ ప్రభుత్వ పట్టతో నీళ్లు కోసం భావి తీసుకొని పంట ను పండించుకుంటున్నారు అలాంటి 80 ఎకరాలు భూమిని కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్ డి ఓ యం ఆర్ ఓ సహకారంతో భూములను బలవంతంగా స్వాధీనం చేసుకుంటున్నారు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్ని అన్నారు. రెక్కడితే కానీ డొక్కాడని కుటుంబాలు కేవలం అదే భూమిని నమ్ముకొని వ్యవసాయం చేసుకుంటున్నారు అలాంటి భూమిని అధికారులు గుంజుకోవడం సరియైన పద్ధతి కాదని అన్నారు అధికారులు పునరాలోచన చేసి రైతులు సాగుచేసుకుంటున్న సాగు భూమిని రైతులకు ఇవ్వాలని భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు గా డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో కమ్యూనిస్టు పార్టీగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో రైతులు కర్నాల యాదగిరి, మర్లేని సోమయ్య,అచ్చయ్య,సోమయ్య,నర్సింహా,లక్ష్మయ్య,మరిలేని ఆనందం,తదితరులు పాల్గొన్నారు.