కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుల పై అనుచిత వ్యాఖ్యలు ఊరుకోం..

Jul 21, 2026 - 00:24
 0  2
కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుల పై అనుచిత వ్యాఖ్యలు ఊరుకోం..

సూర్యపేట జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎలిమినేటి అభినయ్.. 

ఇటీవల సరూర్ నగర్ లో బిఆర్ఎస్ పార్టీ నిర్వహించిన యువ సంగ్రామ సదస్సులో పలువురు పెయిడ్ ఆర్టిస్టులు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుల పై అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల సూర్యపేట జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎలిమినేటి అభినయ్ మండిపడ్డారు. ఈ మేరకు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ అగ్ర నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ లో టూ టౌన్ ఎస్ఐ గోపికృష్ణ కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... 10 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని పాలించి ఉద్యోగాలు ఇవ్వకుండా నేడు నిరుద్యోగ యువతను అబద్ధపు ప్రచారాలతో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. గతంలో వారి హయాంలో నోటిఫికేషన్లను ఇచ్చి పేపర్లను లీక్ చేసిన చరిత్రను యువత మర్చిపోలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడగానే 531 గ్రూప్ వన్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇవ్వగా దానిని కూడా ఆపేందుకు ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఈ రెండున్నర సంవత్సర కాలంలో 70 వేల ఉద్యోగాలు ఇవ్వడాన్ని బిఆర్ఎస్ పార్టీ జీర్ణించుకోలేకపోతుందని తెలియజేశారు.దీంతో కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులతో నిరుద్యోగులను రెచ్చగొట్టి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రయత్నాన్ని యువత తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సంకరమద్ది శ్రావ్య సుధీర్ రెడ్డి ,అసెంబ్లీ అధ్యక్షుడు జావిద్ బెగ్, యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ బలవంతుల వినయ్ కుమార్,యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు,నియోజకవర్గ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ చింత సుధీర్,పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బొడ్డు సాయి గౌడ్,దంగూల శివ,కృష్ణ, గోపి, రమేష్ రెడ్డి,సాయి,లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333