టిప్పర్ ఓనర్లపై వేధింపులు ఆపాలి: యజమానుల డిమాండ్
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద అనవసర కేసులు అక్రమ జరిమాణాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ టిప్పర్ ఓనర్లు నిరసన వ్యక్తం చేశారు. టిప్పర్ వాహన యజమానులపై జరుగుతున్న వేధింపులను వెంటనే నిలిపివేయాలని టిప్పర్ ఓనర్ల సంఘం డిమాండ్ చేసింది. అధికారులు తరచూ తనిఖీల పేరుతో అనవసర ఇబ్బందులకు గురిచేస్తున్నారని, దీంతో తమ జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాలకు అనుగుణంగా నడుచుకునే వాహన యజమానులను ఇబ్బందులకు గురిచేయకుండా, నిబంధనలు ఉల్లంఘించిన వారిపైనే చర్యలు తీసుకోవాలని సంఘం కోరింది. టిప్పర్ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. వేధింపులు ఇలానే కొనసాగితే ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని సంఘం హెచ్చరించింది.ఈ నిరసనలో టిప్పర్ ఓనర్ల జిల్లా అధ్యక్షుడు నల్లకుంట సత్యం, ఉపాధ్యక్షులు జంటంగి సవనయ్య, కోశాధికారి సుధాకర్ రెడ్డి, నాగరాజు,రవి, శ్యామ్, శీను, జానీ, రవి, సైదులు నాగరాజు, మున్నా, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు