సూర్యాపేటను దేశంలోనే నంబర్ వన్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యం

Jul 23, 2026 - 21:05
 0  2
సూర్యాపేటను దేశంలోనే నంబర్ వన్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యం

పేట ప్రజల దాహార్తిని తీర్చేందుకు త్వరలో  దోసపాడు ప్రాజెక్టు పునఃప్రారంభం.

24 వ వార్డులో 5 లక్షల వ్యయంతో మురికి కాలువ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్ష్యాది.

జె న్యూస్ ప్రతినిధి సూర్యాపేట: సూర్యాపేట మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే ఆదర్శవంతమైన, నంబర్ వన్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని సూర్యాపేట మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్ష్యాది అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 24వ వార్డు సీతారాంపురం ప్రాంతంలో మున్సిపల్ సాధారణ నిధుల ద్వారా మంజూరైన 5 లక్షలతో మురికి కాలువ (డ్రైనేజీ) నిర్మాణ పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వార్డుకు విచ్చేసిన చైర్‌పర్సన్‌కు 24వ వార్డు కౌన్సిలర్ మన్నెం అరుణ మల్లేష్ లు శాలువాతో ఘనంగా సన్మానం చేసి ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. పట్టణంలోని శివారు ప్రాంతాలతో పాటు అన్ని వార్డులను సమానంగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన సూర్యాపేటను నిర్మించేందుకు మున్సిపాలిటీ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. రానున్న వేసవికాలంలో నీటి ఎద్దడిని నివారించేందుకు దోసపాడు ప్రాజెక్టును పునరుద్ధరించి, సూర్యాపేట ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా శాశ్వత పరిష్కారం అందించే దిశగా చర్యలు చేపడతామని చెప్పారు. సూర్యాపేట సమగ్ర అభివృద్ధికి ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాలకు భాగస్వాములు కావాలని చైర్‌పర్సన్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333