శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి

Jul 22, 2026 - 20:00
 0  1
శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి
శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి

అదనపు కలెక్టర్ నర్సింగరావు.

జోగులాంబ గద్వాల 22 జూలై 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి :  గద్వాల. విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాల పైనే ఆధారపడకుండా స్వయం ఉపాధి పొందేందుకు వివిధ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించే పలు శిక్షణ కార్యక్రమాలు ఉపయోగపడతాయని, సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ నర్సింగరావు అన్నారు.

బుధవారం గద్వాలలోని  ప్రభుత్వ ఎంఏఎల్డి డిగ్రీ కళాశాలలో ఆర్ సెటీ (రూరల్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్) ఆధ్వర్యంలో  పుట్టగొడుగుల పెంపకంపై విద్యార్థులకు నిర్వహించే శిక్షణ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్  మాట్లాడుతూ స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకొని యువత ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. పుట్టగొడుగుల పెంపకం తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయాన్ని అందించే ఉపాధి మార్గమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ షేక్ కలందర్, ఎల్‌డీఎం శ్రీనివాసరావు, డైరెక్టర్ శ్రీనివాస్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333