పోషకాహారం పై మల్లారెడ్డి యూనివర్సిటీ విద్యార్థులు అవగాహన సదస్సు
నర్సాపూర్ 22 జూలై 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– మెదక్ జిల్లా నర్సాపూర్ మండల పరిధిలోని మూసాపేట్ గ్రామం అంగన్వాడీ లో మల్లారెడ్డి యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ కు చెందిన బిఎస్సి అగ్రికల్చర్ విద్యార్థులు రూరల్ అగ్రికల్చరల్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రాంలో భాగంగా పోషక ఆహార లోపం పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.పోషకాహార లోపం వల్ల కలిగే సమస్యలు, వాటి నివారణపై వివరించారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్, అంగన్వాడి పిల్లలు,అలాగే గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు.ఈ అవగాహన కార్యక్రమాన్ని బీఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థినులు హారిక,కౌలిక,పూజిత, స్పందన,సాక్షి,శ్రీవాణి,తేజశ్రీ కలిసి నిర్వహించారు.