పిహెచ్ సి ఆసుపత్రికి తాళాలు .... పట్టించుకోని పై అధికారులు

Apr 19, 2026 - 22:05
Apr 19, 2026 - 22:11
 0  5
పిహెచ్ సి ఆసుపత్రికి తాళాలు .... పట్టించుకోని పై అధికారులు

  విధులకి హాజరు కాకుండా హాస్పిటల్ కి తాళాలు వేసిన తిరుమలగిరి పీహెచ్ వైద్య సిబ్బంది

తిరుమలగిరి 20 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ :- తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండల కేంద్రం లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో విధుల పట్ల నిర్లక్ష్యం గా సిబ్బంది ఉన్నారని యువజన కాంగ్రెస్ సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులు కందుకూరి అంబేద్కర్ అన్నారు. 24 గంటలు ప్రజలకి అందుబాటులో ఉండాల్సిన స్టాఫ్ నర్సులు మరియు సిబ్బంది హాస్పిటల్ కి తాళాలు వేయడం వలన ప్రజలు ఇబ్బంది పడుతున్నామని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకి అవసరమైన ఆరోగ్యం విషయం లో జాగ్రత్తలు తీసుకుంటున్న ఇలాంటి సిబ్బంది వలన ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడంతో పాటు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పై అధికారులుఇలా విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బంది పై కఠినమైన చర్యలు తీసుకొని ప్రజల కి న్యాయం చెయ్యాలని కోరారు. ఈ కార్యక్రమం లో NSUI సోషల్ మీడియా జిల్లా కోర్డినేటర్ గద్దల అందీప్ తదితరులు పాల్గొన్నారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి