పెన్ పహాడ్ మండల వాసుల నుండి 

Jul 13, 2024 - 21:47
 0  43
పెన్ పహాడ్ మండల వాసుల నుండి 
పెన్ పహాడ్ మండల వాసుల నుండి 

మిర్యాలగూడలో భారీగా గంజాయి పట్టివేత

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. అక్రమ గంజాయి రవాణా చేస్తున్న నిందితుడిని అరెస్టు చేయడంతో పాటు రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు 

శనివారం మిర్యాలగూడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో

మిర్యాలగూడ డిఎస్సీ రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో మిర్యాలగూడ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సుధాకర్, ఎస్సై రవి వారి సిబ్బంది పట్టణంలో గాలింపు చర్యలలో ఉన్న క్రమంలో ఈ నెల 12 న మధ్యాహ్నం పట్టణ శివారు నందు అనుమానాస్పదంగా కనిపించిన రెండు వాహనాలు తనిఖీ చేశారు

వెహికిల్ నెం.1 TS-08-0-0433 మహింద్రా బోలెరో వాహనం, 15-29-1-6434 మహిళ మెరాజొ వాహనాలను తనిఖీ చేసి క్రమంలో అందులో ఉన్న దాదాపు నలుగురు వ్యక్తులు పోలీసు వారిని చూసి పారిపోగ ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని తనిఖీ చేశారు. అట్టి వాహనాలలో సుమారు 35 లక్షల రూపాయల విలువగల 140.585 కిలోల గంజాయి పట్టుబడిందని తెలిపారు

గంజాయి అక్రమ రవాణా గురించి అదుపులోకి తీసుకున్న వ్యక్తి భూక్యా రాముని విదారించగా అతను చెప్పిన వివరాల ప్రకారం ఈరెండు వాహనాలు 

సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలానికి చెందిన నూనవత్ జగన్, నునావత్తు మంచ  నాయక్ ల ఆదేశాల మేరకు ఒకటి హైదరాబాద్ నుండి, మరొకటి సూర్యాపేట నుండి దేవరకొండ ప్రాంతంలో మద్దిమడుగు వెళ్ళే దారిలో నిర్జన ప్రదేశంలో గుర్తుతెలియని వ్యక్తులు సరఫరా చేసిన గంజాయిని రెండు వాహనాలలో లోడ్ చేసుకుని జగన్,  మంచ నాయక్ ఆదేశాల మేరకు రవాణా చేస్తున్నట్లు తెలిపారు .

పెన్ పహాడ్ మండలానికి చెందిన మరికొంత మండి ఉన్నట్లు తెలిపినాడు. పరారీలో ఉన్న నిందితుల గురించి మిర్యాలగూడ డి.ఎస్.పి ఆధ్వర్యంలో ముగ్గురు సిఐ లతో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. ఈ గంజాయి సప్లై చేసినది ఎవరు ఇది ఎటు రవాణా అవుతుంది అనే విషయమై పోలీసు వారు విచారణ చేస్తున్నార

 గంజాయి రవాణాలో పట్టుబడ్డ రాము పై మరియు ఇతర నిందితులపై గతంలో కేసులు ఉన్నాయని తెలిపారు

నిందితుల వివరాలు

నూనవత్ బగన్, వయస్సు 32 సంఘాలు, న్యూ బంజారాహిల్స్, పెన్ పహాడ్ మండలం, పరారీలో ఉన్నాడు

2. నునావత్ మంచ  నాయక్, వయస్సు 45 సం//లు, జల్ మాల్ కుంట తండ, పెన్ పహాడ్ మండలం, పరారీలో

3. ఆంగోతు నాగరాజు, వయస్సు 33 సం||లు, లాల్ సింగ్ తండ, పెన్ పహాడ్ మండలం, (పరారీలో ఉన్నాడు

4. బాణోతు సాయి, వయస్సు 28 సం//లు, జుబ్లీపుర, ఖమ్మం జిల్లా, (పరారీలో ఉన్నాడు

5. భూక్యా రాము S/O రామోజీ, వయస్సు 35 సం!!లు, వృత్తి: ప్రైవేట్ ఎంప్లాయి, నివాసం: లాల్ సింగ్ తండ, పెస్ పహాడ్ మండలం (అరెస్ట్ చేయబడిన వ్యక్తి

నిందితుడి నుండి స్వాదీన పర్చుకున్న పొత్తు వివరాలు

140.585 కిలోల గంజాయి (35 లక్షల విలువ గలది

2. TS-08-D-0433 3. TS-29-F-6434


ఈ కేసులో మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో మిర్యాలగూడ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సుదాకర్, పోలియా ఇన్స్పెక్టర్ జనార్ధన్, హాలియా ఎస్సై సతీష్, మిర్యాలగూడ వన్ టౌన్ ఎస్ఐ రవి మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333