పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్, ఆత్మకూర్ (ఎస్) లో అకాడమిక్ ప్యానెల్ తనిఖీ
తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్, ఆత్మకూర్ (ఎస్) లో అకాడమిక్ ప్యానెల్ తనిఖీ* పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్, ఆత్మకూర్ (ఎస్) లో 27.01.2026 న డా. వేణుగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మొత్తం ఆరు సభ్యులతో కూడిన అకాడమిక్ ప్యానెల్ ఇన్స్పెక్షన్ బృందం పాఠశాలను సందర్శించింది. ఈ సందర్భంగా బృందం పాఠశాలలో అమలవుతున్న విద్యా కార్యక్రమాలు మరియు సదుపాయాలను సమగ్రంగా పరిశీలించింది. ముఖ్యంగా 1. తరగతి గదుల బోధనా విధానాలు, 2. ప్రయోగశాలల పనితీరు, 3. గ్రంథాలయ కార్యకలాపాలు, 4. మధ్యాహ్న భోజన పథకం పర్యవేక్షణ, 5. పాఠశాలలో నిర్వహిస్తున్న పీఎం శ్రీ కార్యకలాపాలు, 6. అకాడమిక్ మరియు పరిపాలనా రికార్డుల పరిశీలన, 7. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కు సంబంధించిన కార్యకలాపాలు, 8. పాఠశాలలో జరుగుతున్న ఇతర సహపాఠ్య కార్యకలాపాల పురోగతిని వివరంగా తనిఖీ చేసింది. పాఠశాలలో అమలవుతున్న విద్యా ప్రమాణాలు, సదుపాయాలు మరియు నిర్వహణ పట్ల బృందం పూర్తి సంతృప్తి వ్యక్తం చేసినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ పి. శ్రీనివాస్ గారు తెలియజేశారు. ఈ తనిఖీ కార్యక్రమంలో అకాడమిక్ ప్యానెల్ సభ్యులు కే. గురుచరణ్, బి.ఎస్. గౌడ్, బి. రమేష్, సి.హెచ్. వాసు, కృష్ణ ప్రియ, ఎస్.కే. సలీం, వెంకటేశ్వర్లు పాల్గొనగా, పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు కూడా హాజరయ్యారు.