కేంద్ర ప్రభుత్వం నూతనంగా తెచ్చిన జి. రాంజీ పథకం రద్దు చెయ్యాలని ధర్నా

Jan 27, 2026 - 20:46
Jan 28, 2026 - 13:28
 0  0
కేంద్ర ప్రభుత్వం నూతనంగా తెచ్చిన జి. రాంజీ పథకం రద్దు చెయ్యాలని ధర్నా

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ కేంద్ర ప్రభుత్వం నూతనంగా తెచ్చిన జి. రాంజీ పథకం రద్దు చేసి ఇప్పటికే అమల్లో ఉన్న మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టమే యధావిధిగా కొనసాగించాలని, ఆత్మకూర్ ఎస్ మండల ఎంపీడీవో ఇన్చార్జి గారికి వినత్పత్రం, ధర్న కేంద్రంలో బిజెపి ప్రభుత్వం దేశ ప్రజలకు, రైతులకు, కార్మికులకు తీవ్రమైన ప్రజా వ్యతిరేక బిల్లును వ్యతిరేకిస్తూ తీసుకువచ్చిన బిల్లుపై పోరాటాలు కొనసాగించాలని ఈ ధర్నా కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు కునుకుంట్ల సైదులు, ఏఐకేఎంఎస్ జిల్లా సహా కార్యదర్శి అలుగుబెల్లి వెంకన్న పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడులుగా తీసుకొచ్చి కార్మికులకు ఉరితాలుగా మారాయి, జి రాంజీ ఉపాధి పథకంలో రద్దుచేసి ఇప్పటికే అమల్లో ఉన్న మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టమును అమలు చేయాలని అలాగే జాబ్ కార్డు ఉన్నవారికి రెండు వందల రోజులు పని కల్పించాలని రోజుకు 600 రూపాయలు కూలి ఇవ్వాలి, చట్టంగా ఉన్న దాని పథకం మార్చడం అంటే దీనిని వెతయ్యడానికి కుట్ర జరుగుతూ ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం 10% కూడా ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. కొత్తగా తెచ్చిన బతుకమ్మలో 60 శాతం కేంద్ర ప్రభుత్వం, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం కూలీలకు ఇవ్వాలని పథకం చేయడం సరైనది కాదు. తక్షణమే దీనిని రద్దుచేసి గత చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలి. అలాగే రైతులకు నష్టం చేకూర్చే నూతన విత్తన చట్టం రద్దు చేయాలి. విద్యుత్ ప్రవేటికరణ ముసాయిదా బిల్లును కూడా రద్దు చేయాలని నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని జరిగే పోరాటంలో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు దాసరి శీను. డేగల వెంకటకృష్ణ, పోరెల్ల దశరథ, కొండేటి సంజీవరెడ్డి ఎస్.కె బైబెల్లి, పి వై ఎల్ జిల్లా అధ్యక్షులు నల్గొండ నాగయ్య, పి ఓ డబ్ల్యు జిల్లా కార్యదర్శి కంచర్ల నర్సమ్మ, ఏఐకేఎంఎస్ నాయకులు గుణగంటి శీను, ఐఎఫ్టియు నాయకులు పగిడి ఎల్లయ్య, ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు భోగిని నాగయ్య, కృష్ణ, వెంకట్ రెడ్డి, బత్తుల వీరయ్య , మాసిరెడ్డి, లాలు, వెంకట్ రెడ్డి, బాదే రాములు, వరికుప్పల మల్లయ్య, నరసయ్య లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు