డిసెంబర్ 10న చలో హైదరాబాద్ విజయవంతం చేయండి

భువనగిరి 06 డిసెంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- వికలాంగులకు 6000 పెన్షన్ వెంటనే అమలు చేయాలి జిల్లా అధ్యక్షులు సురుపంగా ప్రకాష్ డిమాండ్ వికలాంగుల హక్కుల జాతీయ యాదాద్రి భువనగిరి ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశాన్ని ఉద్దేశించి NPRD జిల్లా అధ్యక్షులు స్వరూపంగా ప్రకాష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు వికలాంగుల పెన్షన్ 6000కు పెంచుతామని సంవత్సర కాలం గడుస్తున్న ఇంతవరకు పెంచకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్త చేయడం జరిగింది. వికలాంగుల పెన్షన్ పెంపు కోసం డిసెంబర్ 10న చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వికలాంగుల అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. అంతేకాకుండా 2016 వికలాంగుల పరిరక్షణ చట్టాన్ని అమలు చేయడం కోసం వెంటనే మార్గదర్శకాలు ఇవ్వాలని, జిల్లాలో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లేపల్లి స్వామి జిల్లా కోశాధికారి కొత్త లలిత జిల్లా కమిటీ సభ్యులు కీసర వెంకటరెడ్డి భువనగిరి మండల అధ్యక్షులు కేతావత్ మురళి మండల నాయకులు శ్రీహరి పోశయ్య తదితరులు పాల్గొనడం జరిగింది.