పార్లమెంటు సభ్యులకు Doctor.చాంద్ పాషా ఎన్ఆర్ఐ సెల్ టిపిసిసి కన్వీనర్  సూటి ప్రశ్న

May 3, 2025 - 18:56
 0  5
పార్లమెంటు సభ్యులకు Doctor.చాంద్ పాషా ఎన్ఆర్ఐ సెల్ టిపిసిసి కన్వీనర్  సూటి ప్రశ్న
పార్లమెంటు సభ్యులకు Doctor.చాంద్ పాషా ఎన్ఆర్ఐ సెల్ టిపిసిసి కన్వీనర్  సూటి ప్రశ్న

      మలేసియాలో గత మూడు సంవత్సరాలుగా ఎజెంటు మోసానికి బలై నరకయాత్ర అనుభవిస్తూ ఎరగట్ల మండలానికి చెందిన పోత్కూరి లింగారెడ్డి ఈ రోజు స్వదేశానికి చేరుకున్నాడు. ఇవన్నీ చూసిన గ్రామస్తులు మరియు బంధువులు ఆవేశానికి గురై ఆనందంతో కంట తడపెడుతూ వారి ఆవేదన వాళ్ళ హక్కు అన్నారు. వర్షకొండకు చెందిన ఒక ఎజెంటు 90 వేల రూపాయలు తీసుకొని మలేసియాలో మంచి ఉద్యోగం ఇప్పిస్తానని విసిట్ విస్పాపై పంపడం జరిగినది. మలేసియాలో చేరిన నుండి సరైన ఉద్యోగం లేకపోవడంతో ఇంటికి ఒక రూపాయి కూడా పంపకుండా అక్కడ ఇక్కడ తలదాచుకుంటూ కాలం గడిపాడు. పోత్కూరి లింగారెడ్డి గత సంవత్సరం ఇంటికి రావాల్సిందిగా ఔట్ పాస్పోర్ట్ వున్న ఎయిర్ టికెట్ డబ్బులు లేకపోవడంతో ఔట్ పాస్పోర్ట్ టైం కూడా ముగిసిపోయింది. గత 3 నెలలు క్రితం ఓ బస్సు ప్రమాదంలో కాలు జారి క్రింద పడడంతో మోకాలు చిప్ప పగిలిపోయినది. ఇట్టి విషయాన్ని వీడియో తీసి ఎరగట్ల గ్రామస్తుడు మాజీ ఎంపీటీసీ , జగిత్యాలకు చెందిన ఎన్ఆర్ఐ సెల్ టిపిటిసి కన్వీనర్ Doctor. చాంద్ పాషాకు  ఫోన్ ద్వారా తెలీజేయడం జరిగినది. విషయం తెలుసుకున్న Doctor.చాంద్ పాషా న్యాయ సలహాలతో భారత ప్రభుత్వం ద్వారా ఇండియన్ ఎంబసీ మలేషియాకు ఈ మెయిల్ సమాచారం పంపడం జరిగినది. ఇట్టి విషయాన్ని పత్రికా ప్రకటనలో చూసి స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుడు Doctor. సునీల్ రెడ్డి గారు మలేసియా నుండి ఇండియా రావడానికి ఎయిర్ టికెట్ కొని ఇవ్వడం జరిగినది. పోత్కురి లింగారెడ్డి స్వంత బావ N. శేఖర్ రెడ్డి Rs.35000 హాస్పిటల్ ఖర్చులకు మలేషియాకు పంపడం జరిగినది, మరియు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి ఇంటికి రావడానికి అంబులెన్సు ఖర్చులు కూడా భరించుకున్నాడు. మలేసియాలో వున్న తెలుగు అసోసియేషన్ బృందం నాయకుడు శ్రీ సత్యం గారు దాదాపు Rs.1,10,000 (ఒక లక్ష పది వేల రూపాయలు) మలేసియా ప్రభుత్వానికి ఓవర్ స్టే పెనాలిటీ చెల్లించడం జరిగినది. అంతేకాక 2 నెలలు 15 రోజులు వాళ్ళ ఆధీనంలో ఉంచుకుని పొత్కూరి లింగారెడ్డి బాగోగులు చూసుకొని నిన్న అనగా 30-04-2025 రోజున మలేసియా ఎయిర్లైన్ ద్వారా హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ చేరుకున్నాడు.  తెలుగు వారికి విదేశాల్లో అస్ట కష్టాలు మొదలయ్యాయి . ఇది కేంద్ర ప్రభుత్వ వైఫల్యం తెలుగోడు చందాలు వేయించుకొని ఇంటికి రావాల్సిన పరిస్థితి ఉంది. 2006 సంవత్సరం నుండి 2014 వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు Doctor. చాంద్ పాషా ఈమెయిల్ ద్వారా సమాచారం అందించిన వెంటనే లక్షల మంది భావితులను కేంద్ర ప్రభుత్వ ప్రవాస భారతీయ మంత్రిత్వ శాఖ ఎంత ఖర్చు అయిన భరించి ఇండియా రప్పించినారు. కాని బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఈ సేవలు పూర్తిగా నిలిపివేయ పడ్డాయి. ఇట్టి వైఫల్యాన్ని కేంద్రాన్ని ప్రశ్నించే వారు లేకపోవడం వల్ల లింగారెడ్డి వంటి వాళ్ళు కష్టాలు ఎదుర్కుంటూ విధేశంలోనే మృత్యువాత పడుతున్నారు. నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు శ్రీ ధర్మపురి అరవింద్ గారు ఇట్టి అంశాలను పార్లమెంటులో లేవదీయక పోవడం ఆశ్చార్యానికి గురిచేస్తుంది. లింగారెడ్డి లాంటి ఎందరో అమాయకలు ఏజెంట్లు మోసాలకు గురై జైలు పాలు అవుతున్నారు. రాష్ట్ర కేంద్ర నాయకలు ఏజెంట్లు పై వత్తాసు పలకడం ద్వారా ఇలాంటి మోసాలకు పోలీసు శాఖ వారు కూడా అడ్డుకట్ట వేయలేక పోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి ఎలాంటి ఆంక్షలు లేకుండా బాధితులకు ఇండియన్ హై కమిషన్ వెల్ఫేర్ ఫండ్ ద్వారా బాధితులను ఇండియా రప్పించవచ్చని. Ex:   External  అఫైర్స్ మినిష్టర్, లేట్ సన్ట్ సుష్మ స్వరాజ్ గారు తెలపడం జరిగినది. ఇట్టి ఫన్డ్ సద్వినియోగం చేస్తూ, విదేశాల్లో చిక్కుకున్న బాధితులను ఇండియా క్షేమంగా రప్పించుటకు ప్రయత్నం చేయాలని ఎన్ఆర్ఐ సెల్ టిపిసిసి కన్వీనర్ Doctor. షేక్ చాంద్ పాషా డిమాండు చేస్తున్నారు. లేని యెడల మరో ఎన్ఆర్ఐ బాధితుల ఉద్యమం తెరపైకి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333