పటాన్ చెరు ఏరియాలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సుడిగాలి పర్యటన

Aug 31, 2024 - 19:49
Aug 31, 2024 - 19:49
 0  3
పటాన్ చెరు ఏరియాలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సుడిగాలి పర్యటన

సంగారెడ్డి జిల్లా :ఆగస్టు 31

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సుడిగాలి పర్య టన చేపట్టారు. అక్కడి సాకి చేరువులో ఇప్పటికే 18 అక్రమ కట్టడాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. 

సాకి చెరువు ఎఫ్టీఎల్ విస్తీర్ణం 135 ఎకరాలు కాగా పదుల ఎకరాల్లో చెరువు కబ్జాకి గురైనట్టు కమిషనర్ దృష్టికి వచ్చింది.ఇన్‌కోర్ సంస్థ నిర్మించిన అపార్ట్‌ మెంట్లను రంగనాథ్ పరిశీలించారు. 

స్థానికంగా ప్రవహించే నక్క వాగు భఫర్ జోన్ వద్ద కబ్జా చేసి బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపట్టారని స్థానికులు ఫిర్యాదులు చేయడంతో ఆ నిర్మాణాలపై అధికారుల నుంచి రంగనాథ్ వివరణ కోరారు.

మియాపూర్ అక్రమ కట్టడా లపై రెవెన్యూ అధికారుల కొరడా ఝుళిపించారు. అక్కడి చెరువులో అక్రమ కట్టడాలు చేసిన బిల్డర్‌పై కేసు నమోదు చేశారు. మ్యాప్స్ ఇన్ఫ్రా యజమాని సుధాకర్ రెడ్డి పైన కేసు నమోదు చేశారు. 

రెవెన్యూ అధికారులు. మ్యాప్స్ కంపెనీ సుధాకర్ రెడ్డితో పాటు పలువురుపై కేసులు నమోదు చేశారు హైడ్రా సిఫార్సుల మేరకు కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. 

ఎర్రగుంట చెరువులో ఆక్రమనలు చేసి బహుళ అంతస్తుల భవనాలను నిర్మించినట్లు గుర్తించారు. ఈర్ల చెరువులో బహుళ అంతస్తుల భవనాలు నిర్మించిన ముగ్గురు బిల్డర్స్ పై కేసులు నమోదయ్యాయి.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333