నిరంజన్ రెడ్డి గారిని విమర్శించే నైతికత మేఘారెడ్డికి ఎక్కడిది?
కె.ఎల్.ఐ పంపుల ప్రారంభం ముమ్మాటికి బి. ఆర్.ఎస్ విజయం.
ఆంధ్రా ప్రయోజనాలు కాపాడడం కోసం రేవంత్ ఆరాటం.
కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగమైన ఎల్లూరు,జొన్నల భోగడ,గుడిపల్లి రిజర్వాయర్ల నుండి సాగు జలాలు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్,జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ డిమాండ్ చేశారు.గౌరవ మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి స్వగృహంలో వారు విలేకరులతో మాట్లాడుతూ.......
ఎమ్మెల్యే మేఘారెడ్డి అవగాహన రాహిత్యంతో ప్రకటనలు విడుదల చేస్తూ ప్రజలలో చులకన అవుతున్నారని ఆరోపించారు. గౌరవ నిరంజన్ రెడ్డి గారికి ప్రాజెక్టుల మీద ,సాగు జలాల మీద అవగాహన లేదని ఎమ్మెల్యే మాట్లాడడం హాస్యాస్పదం అని అన్నారు. కె.సి.ఆర్ గారు నిరంతరం రైతుల సంక్షేమం కోసం జూరాల ప్రాజెక్టులో నీటి లభ్యతను ముందే పసిగట్టి రియర్వాయర్లు నింపి పంటలు పండించి సస్యశామలం చేశారని కానీ నేటి ప్రభుత్వం ఆంధ్రా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం కోసం ఉన్న సాగు జలాలు వినియోగించుకోవడంలో దారుణంగా విఫలమైందని విమర్శించారు.
మహారాష్ట,కర్ణాటక నుండి జూరాల ప్రాజెక్టుకు 2లక్షల 30వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని వరద నీటిని సద్వినియోగం చేసుకొని రిజర్వాయర్స్ నింపి వర్షాకాలం,యాసంగి పంటలకు సాగు నీళ్లు ఇవ్వాలని గట్టు యాదవ్ వాకిటి శ్రీధర్,నందిమల్ల.అశోక్ డిమాండ్ చేశారు.
????ప్రభుత్వానివి తప్పుడు అవగాహన లేని ప్రకటనలు.
గౌరవ మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి.నిరంజన్ రెడ్డి గారు నార్లపూర్ రిజర్వాయర్ ముట్టడి చేస్తామని హెచ్చరించిన తర్వాత ఎల్లూరు, జొన్నల భోగడ గుడిపల్లి రిజర్వాయర్ లలో మూడు పంపులు ప్రారంభించామని ప్రకటించడం సిగ్గుచేటని అన్నారు.
ఎల్.నీ.ఓ పేరిట కె.ఎల్.ఏ నుండి ఒక పంపు మాత్రమే ప్రారంభించి పంపులు ఆన్ చేశామనడం ప్రభుత్వ అవివేకం అని అన్నారు.
????నీళ్ల మీద, రైతుల మీద, వ్యవసాయం మీద బాధ్యత, మమకారం, సోయి లేని సన్నాసులకు సమాచారం కోసం
????నిన్న బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ నెల 11న నార్లాపూర్ ముట్టడిస్తామని హెచ్చరికలు చేసిన తరువాతే కాలువలకు నీళ్లు వదిలారు.
????ఇప్పటికీ కూడా గుడిపల్లి రిజర్వాయర్ లో నీళ్లు ఎత్తిపోస్తున్నారు. కానీ కాలువలకు ఈ క్షణం వరకు వదల్లేదు
????బీఆర్ఎస్ హెచ్చరికల తరువాతనే ఎల్లూరు, జొన్నలబొగుడ, గుడిపల్లిలలో మోటార్లు ఆన్ చేశారు
????తాగునీటి కోసమే ఎల్లూరు, గుడిపల్లి, జొన్నలబొగుడ రిజర్వాయర్లు నింపేందుకు ప్రయత్నించారు. కానీ రైతులకు సాగునీరు ఇవ్వడానికి కాదు. ఇప్పటికి కూడా ఎక్కడా రైతులకు సాగునీరు విడుదల చేయడం లేదు.
????ప్రభుత్వానికి చిత్తశుద్ది కేఎల్ఐ పరిధిలోని 500 చెరువులు, కుంటలు వెంటనే నింపాలి. రైతులకు సాగునీరు అందించాలి
????బీఆర్ఎస్ హెచ్చరికల నేపథ్యంలోనే ప్రభుత్వం పూర్తి స్థాయిలో మోటార్లు ఆన్ చేసింది. నిన్న సాయంత్రం వరకు ఎల్లూరు, జొన్నలబొగుడలలో నడిచింది ఒక్కటే మోటరు. ప్రస్తుతం కూడా జొన్నల బొగుడలో ఒక్కటే మోటారు నడుస్తుంది
????గుడిపల్లిలో ఈ క్షణం వరకు నీళ్లు విడుదల చేయలేదు. బీఆర్ఎస్ హెచ్చరికలతో కాంగ్రెస్ నేతలు అబద్దాలు ప్రచారం చేస్తున్నారు
2వందల రోజుల పాటు పంపులు నడిచే అవకాశం ఉన్నందున ఇప్పటికైనా వానకాలం యాసంగి పంటలకు సాగు నీళ్లు అందించాలని గట్టు యాదవ్ వాకిటి శ్రీధర్ నందిమల్ల.అశోక్ డిమాండ్ చేశారు.
ఈ సమావేశములో కె.మాణిక్యం,గంధం.పరంజ్యోతి,ఉంగ్లం.తిరుమల్,ధర్మశాస్త్ర,మహేశ్వర్ రెడ్డి, జోహెబ్ హుస్సేన్,సయ్యద్.జమీల్, పాండు తదితరులు ఉన్నారు.