నేడు మంత్రి ఉత్తమ్ రాక ...ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
తిరుమలగిరి 23 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మండలంలోని తాటిపాముల గ్రామంలో నేడు ఇరిగేషన్ మరియు సివిల్ సప్లై శాఖ మాత్యులు నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే మందుల సామెల్ పర్యటిస్తున్నారు. పర్యటన లో భాగంగా ప్రాథమిక ఉన్నత పాఠశాల మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శంకుస్థాపన మరియు చెక్ డ్యాం కం బ్రిడ్జ్ పరిశీలన చేయుట కొరకు తాటిపాముల గ్రామానికి విచ్చేయుచున్నారు. కావున ఇట్టి కార్యక్రమానికి సంబంధించి జాయింట్ కలెక్టర్ సూర్యాపేట ఏర్పాట్లను పరిశీలించారు. ఇట్టి కార్యక్రమంలో మండల తహశీల్దార్ ,ఎంపిడిఓ,MPO,MEO,అదరపు గిర్ధవర్ మరియు జిపిఓ , పంచాయతీ సెక్రెటరీతాటిపాముల పాల్గొన్నారు....