ఆర్థిక సాయం అందజేత
జోగులాంబ గద్వాల 8 ఆగస్టు 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- పేరు కృష్ణ పిల్లిగుంట్ల గ్రామం లో తాత్కాలిక గుడిసే వేసుకుని నివసిస్తున్నాడు ఆటోలో తిరుగుతూ పాత చీరలన్నిటిని కలెక్ట్ వాటిని కర్నూల్ పట్టనం లో అమ్ముకుంటూ చిన్న వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న క్రమంలో వాళ్ల నాన్న తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్ పాలైనప్పుడు దాదాపు రెండు లక్షల వరకు అప్పుచేసి వల్ల నాన్న కు ట్రీట్మెంట్ చేయించిన ఆయన చనిపోవడం జరిగింది తదనంతరం ఈ అబ్బాయికి కూడా ఆటోలో వెళుతున్న క్రమంలో యాక్సిడెంట్ కావడంతో ఆటో పూర్తిగా డామేజి అయి షెడ్డుకు పరిమితము కావడం జరిగింది ఇతనికి కూడా కాలు విరగడం జరిగింది తన చిన్న వ్యాపారం కూడా బంద్ కావడంతో ఇంటికి పరిమితం కావడం జరిగింది ఈ మధ్యకాలంలో ఇతనుకి బాబు కూడా పుట్టటం జరిగింది అబ్బాయి కూడా చిన్న పుట్టినప్పుడే అనారోగ్యంతో పుట్టడం జరిగింది అతను తిరిగి తన వ్యాపారం ప్రారంభించుకోవడానికి తన ఆటోను రిపేర్ చేసుకోవడానికి సుమారు 30,000/- అవుతుందని దీనికోసమై సోషల్ రెస్పాన్సిబిలిటీ టీమ్ ను రిక్వెస్ట్ చేయడం తొ అతనికి 30,000 /- రూపాయలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీమ్ సభ్యులు వెంకటేష్, సంజీవ్, ఆంజనేయులు, మురళి, నాగరాజు, రాజన్న, బెంజావేను, చారీ, అశోక్ తదితరులు ఉన్నారు.