నారాయణ స్కూల్ విద్యార్థులకు నాసా కిట్టు పంపిణి.
ఖమ్మం : నారాయణ ఇంగ్లీష్ మిడియం స్కూల్ జిమ్మబండ బ్రాంచిలో విద్యార్థులను ప్రోత్సహించడానికి మరియు వారిలో ఉన్న ప్రతిభను , సృజనాత్మకతను వెలికి తీయడానికి నాసా కాంటెస్ట్ లో పాల్గొన్న విద్యార్థులకు "నాసాకిట్లు" పంపిణి చేయడం జరిగింది . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నాసా డిస్ట్రిక్ట్ కన్వీనర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అఫ్ ఫిజిక్స్ డా॥ నర్సింగు శ్రీనివాసరావు పాల్గొని ఏజీఎం రాంకీ తో కలిసి పిల్లలకు కిట్లు పంపిణి చేశారు . ఈ నా సా కాంటెస్ట్ అంతరిక్షంలో ఎలా జీవించాలి అనే అంశంపై ఈ సంవత్సరం టీమ్ తో వినుత్న ప్రాజెక్టుపై పనిచేయడానికి విదార్థులను ప్రోత్సహిస్తుందని అన్నారు . నారాయణ విద్యా సంస్థలో నిరంతరంగా ఈ నాసా కాంటెస్ట్ కొనసాగుతూ విజయాలను చవిచూస్తుందని అన్నారు . ఈ సంవత్సరం కూడా విజయం చేకూరాలని నర్సింగు శ్రీనివాసరావు ప్రాజెక్టు వివరాలను తెలుసుకొని విద్యార్థులను అభినందించారు . ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రేఖ , ఏ ఓ నర్సింహరావు , నాసా ఇంచార్జ్ అపర్ణ మరియు విద్యార్థులు పాల్గోన్నారు .