నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా భద్రత తనిఖీలు చేపట్టిన జిల్లా పోలీసు సెక్యూరిటీ సిబ్బంది
నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖ ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగింది, యువత ఆదర్శంగా ఉండాలని ఉత్సవాలు జరుపుకునే వారు ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఇండ్లలో వేడుకలు చేసుకోవాలని అవగాహన కల్పించారు. ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు మంగళవారం బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సెక్యూరిటీ సిబ్బంది జిల్లాలో ముఖ్యమైన ప్రాంతాల్లో బస్టాండ్ లు, రద్దీ ప్రాంతాలలో,దేవాలయాల వద్ద దర్శనం దృష్ట్యా ముందస్తుగా భద్రత పరిశీలన చేసినారు.