నాణ్యమైన ధాన్యాన్ని తీసుకొచ్చి మద్దతు ధర పొందాలి..

Oct 22, 2024 - 18:42
 0  7
నాణ్యమైన ధాన్యాన్ని తీసుకొచ్చి మద్దతు ధర పొందాలి..

నాణ్యమైన ధాన్యాన్ని తీసుకువచ్చి రైతులు మద్దతు ధరను పొందాలని టౌన్ మిషన్ కోఆర్డినేటర్ ఇ శ్వేత అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంగళవారం 10వ వార్డ్ కుప్పిరెడ్డిగూడెం లో ఐకెపి కేంద్రాన్ని ప్రారంభించి వారు మాట్లాడారు తేమ ఉన్న ధాన్యాన్ని తీసుకురాకుండా వాటిని పొలాల వద్దనే ఎండ పెట్టుకొని తీసుకొని రావాలని అన్నారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలలో  అమ్మి మద్దతు పొందాలన్నారు. ప్రభుత్వం ఇచ్చే 500 రూపాయల బోనస్ ను రైతులు పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సి ఓ సువర్ణ, అధ్యక్షులు చెరుకుపల్లి ఉప్పమ్మ, ఆర్ పి రాణి, వార్డు ఇన్చార్జ్ చింత వెంకన్న, ఐకెపి కమిటీ సభ్యులు ఎల్లమ్మ, నరసమ్మ, నీలమ్మ, తిరుపమ్మ, మన్సూర, రైతులు కనుకు వెంకన్న, వెంకట్ రెడ్డి, ఏనుగు వెంకటరెడ్డి, యాదగిరి, సురేందర్ రెడ్డి, నాగరాజు, గోపి, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333