నకిలీ ధ్రువ పత్రాలు తయారీ గుట్టురట్టు చేసిన రెవెన్యూ అధికారులు

May 2, 2026 - 19:37
 0  1
నకిలీ ధ్రువ పత్రాలు తయారీ గుట్టురట్టు చేసిన రెవెన్యూ అధికారులు
నకిలీ ధ్రువ పత్రాలు తయారీ గుట్టురట్టు చేసిన రెవెన్యూ అధికారులు
నకిలీ ధ్రువ పత్రాలు తయారీ గుట్టురట్టు చేసిన రెవెన్యూ అధికారులు

జోగులాంబ గద్వాల 2మే 2026 తెలంగాణ వార్త ప్రతినిధి :  అయిజ. మున్సిపాలిటీ కేంద్రంలో నకిలీ ధ్రువపత్రాలు తయారు చేసిన లక్ష్మీ నరసింహ ప్రింటింగ్ ప్రెస్ పై రెవిన్యూ అధికారులు దాడి చేసి గుట్టురట్టు చేశారు. శనివారం మండల తహసిల్దార్ ఎన్. జ్యోతి ఆదేశాల మేరకు ఆర్. ఐ రజినీకాంత్ రెడ్డి మరియు జీపీవోలు లక్ష్మీనరసింహ ప్రింటింగ్ ప్రెస్ పై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో వివిధ శాఖలకు సంబంధించిన గవర్నమెంట్ డాక్టర్స్, సర్పంచులు,  హెడ్మాస్టర్లు, మ్యారేజ్ సర్టిఫికెట్స్ ఆధార్ కార్డులు, ఎస్ఎస్సి మెమోలు, తదితర నకిలీ ధ్రువ పత్రాలకు సంబంధించిన ముద్రలు రాయలసీమలోని వివిధ జిల్లాలకు సంబంధించిన ముద్రలు, గట్టు మండలం కు ముద్రలు పెద్ద ఎత్తున సుమారు 18 దొరికాయి. అలాగే కంప్యూటర్ ని ఓపెన్ చేయగా సుమారు 150 పైగా వివిధ పత్రాలు నకిలీవి తయారు చేసినట్టు గుర్తించారు. అనంతరం సిపిఓ కంప్యూటర్ తదితర వాటిని స్వాధీనం చేసుకొని దర్యాప్తు నిమిత్తం పోలీస్ డిపార్ట్మెంట్కు అప్పచెప్పినట్లు తెలిపారు. ఈ విషయమై తాసిల్దార్ మాట్లాడుతూ మాకు వచ్చిన నమ్మదగిన సమాచారం, కంప్లైంట్ మేరకు దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ఎవరైనా ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. ఈ దాడుల్లో రెవెన్యూ ఇన్స్పెక్టర్ తో పాటు జిపిఓ లు జ్యోతి, రహమతుల్లా, బాలు ఉన్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333