మహిళలు, పిల్లల భద్రతపై భరోసా సెంటర్ సిబ్బంది అవగాహన కార్యక్రమం

May 2, 2026 - 19:38
 0  1
మహిళలు, పిల్లల భద్రతపై భరోసా సెంటర్ సిబ్బంది అవగాహన కార్యక్రమం
మహిళలు, పిల్లల భద్రతపై భరోసా సెంటర్ సిబ్బంది అవగాహన కార్యక్రమం

 జోగులాంబ గద్వాల 2 మే 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి :  గద్వాల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న99 రోజుల  ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళల భద్రత, పిల్లల భద్రత, మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించేందుకు శనివారం జిల్లా మహిళా భరోసా సెంటర్ సిబ్బంది జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని పబ్లిక్ ప్రదేశాల్లో కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులకు గురైనపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాక్సో చట్టం ప్రాముఖ్యత, సహాయం కోసం ఎలా సంప్రదించాలి వంటి విషయాలపై అవగాహన కల్పించారు. మహిళలపై ఎలాంటి వేధింపులు జరిగినా వాటిని ఉపేక్షించకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదు చేస్తేనే ఇలాంటి ఘటనలను అరికట్టవచ్చని తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333