వికలాంగుల పెన్షన్ 6వేలు అమలుచేయాలి జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్
అడ్డగూడూరు 02 మే 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– వికలాంగుల హక్కుల జాతీయ వేదిక బోర్డు యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని చిర్రగూడూరు, జానకిపురం,చౌళ్ళరామరం గ్రామాలలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మే 1 నుండి 10 వరకు రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులు ఎదుర్కుంటున్న సమస్యల పైన సర్వే,చేయాలని పిలుపు, జిల్లాలో అడ్డగూడూరులో సర్వే లో పాల్గొని వారి సమస్యలు తెలుసుకొని వనం ఉపేందర్ మాట్లాడుతు..వివిధ గ్రామంలో సదరం సర్టిఫికెట్ యూడిఐడి కార్డ్ ఉన్న గత 5సం"నుండి పెన్షన్ కోసం ఎదురు చూస్తానామని కొంత మంది ఆవేదన వ్యక్తం చేశారు.ఉపాధి లేక బాధ పడుతున్నారు. ఇందిరమ్మ ఇళ్లు ప్రతి వికలాంగులకి మంజూరు చేయాలని. ప్రభుత్వం వచ్చినాక వికలాంగులకు 6 వేలు ఇస్తామని రెండున్నర సంవత్సరాలు అవుతున్న ఎందుకు ప్రభుత్వం ఇవ్వడం లేదని, తక్షణమే పింక్సన్ పెంచి,కొత్త పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.గ్రామలలో కమిటీలు చిర్ర గూడూరు,చౌళ్ళరామారం, జానకీపురం గ్రామాలలో గ్రామ కమిటీలు ఎన్నుకోవడం జరిగింది,ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చిత్తలూరి శ్రీహరి అడ్డగూడూరు మండలం అధ్యక్షులు దుస్సా వెంకటేశం, చిర్రగూడూరు గ్రామ అధ్యక్షురాలు శీల శోభ, కార్యదర్శి మాదాని బాలరాజు కడియం నాగయ్య ఉపాధ్యక్షులు శీల ఐలమల్లు సహాయ కార్యదర్శి దర్శనాల జానకిపురం గ్రామ అధ్యక్షులు చింత పరశురాములు కార్యదర్శి బోనాల బాబు, కోశాధికారి బోనాల పద్మ, ఉపాధ్యక్షులు మెతుకు యాదగిరి,సహాయక కార్యదర్శి చింత సావిత్రి,చౌళ్ళరామారం గ్రామ అధ్యక్షులు సంఘీ మల్లేశం, కార్యదర్శి సురకాల శ్రీనివాస్, కోశాధికారి నాగిని జయమ్మ, ఉపాధ్యక్షులు బెజిగం చంద్రయ్య, సహాయక కార్యదర్శి బెజిగం మహేష్ తదితరులు పాల్గొన్నారు.