ధరూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగ తనిఖీ చేసిన

జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డా. సంధ్య కిరణ్మయి.

Aug 28, 2026 - 17:33
Aug 29, 2026 - 01:20
 0  73
ధరూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగ తనిఖీ చేసిన
ధరూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగ తనిఖీ చేసిన

జోగులాంబ గద్వాల 28 ఆగస్టు 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- PHCలోని వివిధ విభాగాలను పరిశీలించి ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది హాజరు, మందుల లభ్యత, వివిధ రిజిస్టర్ల నిర్వహణ, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలను క్షుణ్ణంగ పరిశీలించారు.అలాగే NCD కార్యక్రమం అమలు, NCD మందుల లభ్యత, టీకాకరణ కార్యక్రమం, కోల్డ్‌చైన్ నిర్వహణ తదితర జాతీయ ఆరోగ్య కార్యక్రమాల పురోగతిపై సమీక్షించారు. PHCలో ప్రసవాల వివరాలను పరిశీలించి, సంస్థాగత ప్రసవాలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ వైద్య సంస్థల్లో ప్రసవాల సంఖ్యను పెంచేల చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు. క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని, నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. అదేవిధంగ PHC పరిసరాలను ప్రతిరోజూ పరిశుభ్రంగ ఉంచాలని, ఆసుపత్రిలో పారిశుద్ధ్యం మరియు పరిశుభ్రత నిర్వహణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. OP విధులకు ఎవరికి ఎర్పాటు  చేయకుండ వైధ్యాదికారి ఐచ్చిక సెలవు తీసుకోవడం పట్ల అగ్రహ వ్యక్తం చేశారు తదనుగుణంగ రెండు రోజుల్లో వివరణ ఇవ్వావలసింధిగ ఆ దేశించడం జరిగింది. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగ నాణ్యమైన వైద్య సేవలను నిరంతరం అందిస్తూ, ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాల అమలులో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా విధులు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State