దైవజనులు డా విలియం కేరి 264వ జయంతి
సతీసహగమనమును, బాల్యవివాహాలను,కుష్టు రోగులను కాల్చి చంపే దురాచారాలను, నిర్మూలిం చుటకు కృషి చేసిన గొప్ప దైవజనులు డా విలియం కేరి 264వ జయంతి
బిషప్ దుర్గం ప్రభాకర్ తెలంగాణ రాష్ట్ర క్రైస్తవ నాయకులు
రెవ డా జలగం జేమ్స్
సూర్యాపేట నియోజకవర్గ పాస్టర్స్ పెలోషిఫ్ అధ్యక్షులు
పాస్టర్ ఇంజమూరి గాబ్రియేల్*
సూర్యాపేట పట్టణ పాస్టర్స్ పెలోషిఫ్ అధ్యక్షులు
ఆదివారం 17 ఆగస్టు : సూర్యాపేట పట్టణ కేంద్రం బేతెస్థ మినిస్ట్రీస్ క్యాంపస్ శాంతినగర్ నందు తెలంగాణ రాష్ట్ర క్రైస్తవ నాయకులు బిషప్ దుర్గం ప్రభాకర్ ఆధ్వర్యంలో విలియం కేరి (ఆగస్టు 17,1761-జూన్ 9,1834) 264వ జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా సూర్యాపేట నియోజకవర్గ పాస్టర్స్ పెలోషిఫ్ అధ్యక్షులు రెవ డా జలగం జేమ్స్, సూర్యాపేట పట్టణ అధ్యక్షులు పాస్టర్ ఇంజమూరి గాబ్రియేల్,చార్లెట్ హోం వ్యవస్థాపకులు బ్రదర్ జాటోత్ డేవిడ్ రాజు పాల్గొని వారి సేవా కొరకు ప్రత్యేక ప్రార్ధన చేశారు. ఈ సందర్బంగా బిషప్ దుర్గం ప్రభాకర్ మాట్లాడుతూ విలియం కేరి 1793 నవంబర్ 17న భారతదేశంలోని కలకత్తా అనే ప్రదేశానికి ఇంగ్లాండ్ నుంచి చేరుకున్నారు ప్రముఖ ఆంగ్ల నాటక రచయిత, కవి, సమాజవాది, భాషానువాది, బహుభాషా వేత్త, విద్యావేత్త. తెలుగుభాషకు 'ఎ గ్రామర్ ఆఫ్ ది తెలింగ లాంగ్వేజ్' అనే పేరుతో 1814లో ఇంగ్లీషు వ్యాకరణం రచించిన వ్యక్తి అతను ఆంగ్లంలోకి రామాయణాన్ని అనువదించాడు ఆధునిక మిషనరీ ఉద్యమ పితామహుడు బైబిల్ ను అవపోసన పట్టిన బహుముఖ ప్రజ్ఞాశాలి క్రైస్తవ లోకానికి ఆణిముత్యం బహుభాషా కోవిదుడు నిరంతర శ్రామికుడు బైబిల్ ను 40 భారత దేశ భాషలోకి అనువదించిన మహనీయుడు భారతదేశంలో క్రీస్తు సువార్తను చాటించినా విదేశీ మిషనరీలో అగ్రగన్యుడు భారతదేశంలో హిందువులను సువార్తికులుగా మార్చిన మొదటి మిషనరీ 1881లో బైబిల్ ను తెలుగులో అందించిన మిషనరీ 1818లో శ్రీరాంపూర్(సెక్యులర్ మరియు థియోలాజికల్) యూనివర్సిటీ స్థాపించి,నేటి వరకు కొనసాగుతున్న ఆ యూనివర్సిటీకు ఆధ్యుడు రాజా రామ్మోహన్ రాయ్ తో కలిసి సతీసహగమనమును నిర్మూలించినవాడు బాల్యవివాహాలను, కుష్టు రోగులను కాల్చి చంపే దురాచారాలను, గంగా నదిలో చిన్న పిల్లలను విసిరే దురాచారాలను నిర్మూలించినవాడు బ్యాంకింగ్ సిస్టమును భారతదేశంలోకి తీసుకు వచ్చినవాడు స్టీమ్ ఇంజన్ రైలు భారతదేశంకు పరిచయం చేసినవాడు ఆడపిల్లలకు ప్రత్యేక పాఠశాలలను స్థాపించిన వాడు దేవదాసి నిషేధిత చట్టం, బానిసలను అమ్మే చట్టం నిషేధించిన వాడు నరబలి నిషేధిత చట్టం, శూద్రులకు ఆస్తి హక్కు చట్టం తీసుకొచ్చినవాడు నిమ్మల జాతులకు విద్యా హక్కు చట్టం కల్పించిన వాడు దిగ్దర్షన్, సమాచార దర్పణం, ఫ్రెండ్ ఆఫ్ ఇండియా అనే పత్రికలను స్థాపించినవాడు స్టేట్స్ మాన్ అనే పత్రికతో కలిసి పని చేశారు భారతదేశం తల ఎత్తుకునేలా పనిచేసిన గొప్ప క్రైస్తవ మిషనరీ 1834 జూన్ 9న ప్రభువు పిలుపుమేరకు మహిమలో ప్రవేశించారు భారతదేశ ప్రభుత్వం ఆయన జ్ఞాపకార్థం ఆరు రూపాయల స్టాంపును విడుదల చేశారు భారతదేశంలో అమోఘమైన సేవలు అందించిన గొప్ప దైవజనుడు నేటి క్రైస్తవ సమాజానికి ఎంతో ఆదర్శప్రాయం అనీ అన్నారు. ఈ కార్యక్రమం లో పాస్టర్ పి. కోర్నెలి పాల్, బ్రదర్ కె అపోలో, పాస్టర్ యం రూబెన్, పాస్టర్ ఆర్ ప్రేమ్ సాగర్, పాస్టర్ కొమ్ము హోసన్నా తదితరులు పాల్గొన్నారు