కస్తూర్బా స్కూల్లో డ్రగ్స్ నియంత్రణ అవగాహన సదస్సు

ఎస్సై వెంకట్ రెడ్డి

Aug 17, 2025 - 23:15
Aug 17, 2025 - 23:16
 0  5
కస్తూర్బా స్కూల్లో డ్రగ్స్ నియంత్రణ అవగాహన సదస్సు

అడ్డగూడూరు 16 ఆగస్టు 2025 తెలంగాణవార్త రిపోర్టర్:–

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని కంచనపల్లి గ్రామంలో కస్తూర్బా పాఠశాల యందు డ్రగ్స్ నియంత్రణ అవగాహన సదస్సు ఎస్ఐ వెంకట్ రెడ్డి శనివారం రోజు విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఆయన మాట్లాడుతూ..విద్యార్థులు చెడు అలవాట్లకు,మాదకద్రవ్యాలకు బానిస కాకూడదు..చదువు పట్లనే శ్రద్ధ చూపాలని అన్నారు.నేటి బాలలే రేపటి బావి భారత పౌరులని అన్నారు.మీరు రాబోయే భవిష్యత్తులో మీ తల్లిదండ్రులు కన్న కలలను నెరవేర్చాలని ముందుకు సాగాలంటే చదువు ఒక్కటే ఆయుధం..ఆ ఆయుధాన్ని చిన్న వయసులోనే ముందుకు సాగేలా అలవర్చుకోవాలి!మీరు ఎప్పుడైనా ఒంటరిగా ఎక్కడికైనా వెళ్లేటప్పుడు ఏ వ్యక్తి అనుమానం వచ్చిన 100 నెంబర్ కు డయల్ చేయాలని అన్నారు.లేకపోతే పోలీస్ కు సమాచారం అందించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ పద్మ,ఉపాధ్యాయుల బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.